రాష్ట్రీయం

తమ్ముళ్ళకు స్మార్ట్ ఫోన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూలై 16: సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పార్టీని వేగవంతంగా మరింత బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ముమ్మర చర్యలు చేపట్టింది.వచ్చే సార్వత్రిక ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐవీఆర్‌ఎస్ పద్ధతిలో ప్రభుత్వం పనితీరుపై ఫోన్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. సీఎం నుంచే ప్రజలకు ఫోన్లు వస్తున్నాయి. తాజాగా పార్టీ ద్వితీయశ్రేణి నాయకులపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రతి బూత్‌కు క్రియాశీలకంగా వ్యవహరించే ముగ్గురు కార్యకర్తలను ఎంపిక చేసి వారికి స్మార్ట్ఫోన్లు అందజేయాలని నిర్ణయించింది. వారి ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితి, ప్రభుత్వం పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులు, ఎలాంటి అభివృద్ధి పనులతో పాటు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేపడుతోంది. ఇందులో ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన ఉండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కార్యకర్తలను గుర్తించి స్మార్ట్ ఫోన్లు అందచేయాలని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రత్యేకంగా టీడీపీ అధిష్ఠానం రూపొందించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అధిష్ఠానానికి పంపేలా స్మార్ట్ఫోన్లు పొందిన కార్యకర్తలకు తర్ఫీదు ఇవ్వనున్నారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా, జనాభా వివరాలను సేకరించి సామాజికపరంగా విభజించి అధిష్ఠానానికి నివేదిక ఇచ్చే విధంగా ప్రత్యేక ఫార్మెట్‌లను రూపొందించింది.
ఇదిలాఉండగా బూత్ స్థాయిలో ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నాయకులను గుర్తించి వారిని టీడీపీలో చేర్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించి ముందుగా బూత్ కన్వీనర్ల నియామకానికి పార్టీ శ్రీకారం చుట్టనుంది. అనంతరం పోలింగ్ బూత్‌ల పరిధిలో చురుకైన ముగ్గురు కార్యకర్తలను గుర్తించి వారికి స్మార్ట్ఫోన్లు అందజేస్తారు. రాష్టవ్య్రాప్తంగా ఇలా టీడీపీ శ్రేణులకు స్మార్ట్ఫోన్లు అందచేసేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో స్మార్ట్ఫోన్ విలువ రూ.6 వేల నుంచి రూ.8 వేల దాకా ఉంటుందన్న తెలియడంతో దాన్ని సొంతం చేసుకునేందుకు కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. తమకే ఫోన్లు వచ్చేలా చూడాలని స్థానిక నాయకులపై ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఎలాంటి ఒత్తిళ్ళకు తావులేకుండా సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన ఉండి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. ఏదేమైనా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే తెలుగుదేశం పార్టీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కార్యకర్తల సాయంతో ఓటింగ్ సరళి పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాలిస్తుందో వేచి చూడాల్సిందే.