రాష్ట్రీయం

మూడు రోజుల్లో నిండనున్న తుంగభద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, జూలై 17: తుంగభద్ర జలాశయం వేగంగా నిండుతోంది. మరో ఐదు అడుగుల మేర నీరు చేరగానే జలాశయం పూర్తిగా నిండుతుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకుని రెండు, మూడు రోజుల్లో జలాశయం నిండుతుందని, అనంతరం గేట్లు ఎత్తి దిగువ నదిలోకి నీరు విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు. తుంగభద్ర పరివాహక ప్రాంతాలైన చిక్కమంగళూరు, భద్రావతి, ఆగుంబె, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద మొత్తంలో వరద నీరు జలాశయానికి చేరుతోంది. తుంగ డ్యామ్ నిండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా మంగళవారం 1628.48 అడుగుల నీరు చేరింది. 84.41 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 75,324 క్యూసెక్కులుగా నమోదైంది. 503 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి కాలువలకు నీరు విడుదల చేయనున్నట్లు తుంగభద్ర నీటి పారుదల సలహా సమితి పేర్కొంది. జలాశయం పరిధిలోని ఎడమ ముఖ్య కాలువ, కుడి దిగువ కాలువ (ఎల్‌ఎల్‌సీ), కుడి ఎగువ కాలువ (హెచ్‌ఎల్‌సీ)కి నీరు విడుదల చేయనున్నారు.