రాష్ట్రీయం

కేంద్రానిది పాతపాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 20: కేంద్రం మాటల్లో నిజాయితీలేదు.. రాష్ట్రానికి ఏంచేశారో పునస్సమీక్ష జరిపినట్లులేదు.. పాతపాటే పాడుతున్నారు.. వాస్తవాలు చెప్పేవరకు వదలొద్దని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం కేంద్రంపై అవిశ్వాసం సందర్భంగా విభజన అంశాలన్నింటినీ లోక్‌సభలో ప్రస్తావించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను అభినందించారు. సచివాలయంలో ఓ వైపు మంత్రులతో మంతనాలు జరుపుతూ మరోవైపు ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ ‘మంచి మిత్రుడని చెప్పుకోవటం కాదు.. రాష్ట్రానికి ఈ నాలుగేళ్లుగా ఏం చేశారో చెప్పి ఉంటే బాగుండేద’ని వ్యాఖ్యానించారు. రాజ్‌నాథ్ మాటల్లో చిత్తశుద్ధి లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గర నుంచి కేంద్రమంత్రులంతా పాతపాటే పాడుతున్నారు తప్ప చేసింది ఏమిటో స్పష్టంగా చెప్పటం లేదని విమర్శించారు. వాళ్లు వాస్తవాలు చెప్పే వరకు వదలొద్దు.. గట్టిగా నిలదీయండి.. రాష్ట్రానికి ఏం చేశారో నిజాయితీగా వివరించండి.. రావాల్సిన వాటి గురించి డిమాండ్ చేయండని ఎంపీలకు సూచించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తెచ్చారు.. వాస్తవాలను అంకెలతో సహా లోక్‌సభ ద్వారా దేశ ప్రజలకు వివరించారని కితాబిచ్చారు. మనకు ఇది జీవన్మరణ సమస్య.. రాష్ట్రానికి న్యాయం చేయాలనేదే డిమాండ్.. అవిశ్వాసం చర్చను అందరూ గమనిస్తున్నారు.. ప్రజల అభీష్టాన్ని నెరవేర్చటమే మన కర్తవ్యమని ఎంపీలకు హితబోధ చేశారు. ఇది మెజారిటీ వర్సెస్ ..మోరాలిటీగా అభివర్ణించారు. కొన్ని రాష్ట్రాలకే మేలు చేయటం వివక్షకు పరాకాష్ట కాదా అని ప్రశ్నించారు. ఏపీని చులకనగా చూస్తున్నారు..కక్షకట్టి నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన రాష్ట్రానికి సంబంధించి జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. దీన్ని మనం ఫోకస్ చేయాలన్నారు. విధిలేని పరిస్థితుల్లో వైసీపీ షో చేస్తోందని విమర్శించారు. ఉనికి కోసం ఆరాటపడుతోందన్నారు. మనకు కేంద్ర ప్రభుత్వం చేసిన నష్టం.. కొన్ని జాతీయ పార్టీలు చేశాయి.. దీనిని పూడ్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.