రాష్ట్రీయం

సుస్థిర ప్రగతే ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 23: విభజన హక్కుల సాధన కోసం ఎంపీలతో కేంద్రంపై పారాటం చేయిస్తూనే అభివృద్ధి కోసం ఆరాట పడుతున్నామని ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యం కావాలని, నాలుగేళ్లలో వ్యవస్థలన్నింటినీ పటిష్ఠం చేశామని ఉద్ఘాటించారు. వీటిని సమర్థవంతంగా వినియోగించుకుని సత్ఫలితాలను సాధించాలన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంగళవారం నుంచి శ్రీశైలం ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగునీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గోదావరి నుంచి కృష్ణానదిలోకి నీరు ప్రవహిస్తోందని, ఇప్పటి వరకు 419 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలిసిందని చెప్పారు. వంశధార, నాగావళికి వరద ప్రభావం పెరిగింది.. మరో పది రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుందని వివరించారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం నుంచి సీమకు నీరందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరుచేరిన వెంటనే సీమకు నీరందించిన దాఖలాలు గతంలో లేవన్నారు. నదుల అనుసంధానంతో పట్టిసీమ ద్వారా అది సాధ్యపడిందని గుర్తుచేశారు. ఇదో భగీరథయత్నంగా అభివర్ణించారు. నాలుగేళ్లలో ప్రభుత్వ ముందుచూపు, కార్యాచరణ వల్లే సాధ్యపడిందని చెప్పారు. జూన్‌లోనే కృష్ణాడెల్టాలో పంటలు వేయటం గత 150 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. సకాలంలో సాగునీరందించటం వల్ల నవంబర్‌లో ఎదురయ్యే తుపానుల బారి నుంచి పంటను కాపాడుకునే వీలు కలిగిందని తెలిపారు. అదేవిధంగా జూలై 3వ వారంలో రాయలసీమకు నీరందించడం మరో రికార్డుగా చెప్పారు. ఇది ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానం, నీరు-ప్రగతి, జల సంరక్షణ ఉద్యమాల ఫలితమే అన్నారు. గతంలో రైతుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి.. నీరు విడుదల చేయాలని కొందరు.. వద్దని మరికొందరు పేచీల దిగేవారని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో పులివెందులకు సైతం నీరందించటం
ప్రభుత్వ ముందుచూపునకు నిదర్శనమన్నారు. వర్షాభావంలో సైతం చీనీ తోటలు ఎండిపోకుండా కాపాడామని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతానికి 2లక్షల 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, నీటిమట్టం 846.5 అడుగులకు చేరిందని నీటి నిల్వ 72.78 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రానున్న నాలుగైదు రోజుల్లో ఇదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంటుందని రోజుకు 8 నుంచి 10 టీఎంసీల నీరు చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేయాలన్నారు. భూమినే జలాశయంగా మార్చుకోవాలన్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్‌ను అందిపుచ్చుకుని సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించాలని నిర్దేశించారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, లోటు ఉన్నచోట రెయిన్‌గన్‌లను వినియోగించాలని సూచించారు. జిబా సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సింగనమల, రాప్తాడు మండలాల్లో ఇప్పటికే రెయిన్‌గన్‌లు వినియోగంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. సీఎం స్పందిస్తూ సకాలంలో రైతులను ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తోతాపురి మామిడి ధర విషయంలో ఇదేతీరున స్పందించి లక్ష టన్నులు కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకున్నామని గుర్తుచేశారు. వనరులు ఉన్నాయి.. నిధులు సమీకరిస్తున్నాం.. వాటి నిర్వహణలోనే మన సామర్థ్యం తేటతెల్లమవుతుందని వ్యాఖ్యానించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లేబర్ కాంపొనెంట్ లక్ష్యాలను అధిగమించామన్నారు. మెటీరియల్ కాంపొనెంట్ లక్ష్యాన్ని కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పంటకుంటలు, సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈ ఏడాది అవార్డులన్నీ ఏపీకే దక్కేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శనివారం స్వచ్ఛదినం పాటించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాలని కోరారు.