రాష్ట్రీయం

ప్రజలతోనే మా పొత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, తమ పొత్తు నేరుగా ప్రజలతోనేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ అన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు, ఇబ్బందులు, అవసరాలు తెలుసుకోవడమే తమ ముందు ఉన్న లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అనంతపురం నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన అనంతరం ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలకు బీజేపీ ద్రోహం చేసినట్లే టీడీపీ, వైకాపా కూడా
అంతే ద్రోహం చేశాయని ధ్వజమెత్తారు. దీంతో టీడీపీ, వైకాపాపై కాంగ్రెస్‌కు విశ్వాసం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని, ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధాని కాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎన్ని ఇబ్బందులున్నా మడమ తిప్పేది లేదన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల కోసం నిబద్ధతను చాటుకుంటామని అన్నారు. హోదా 5 ఏళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ కోరితే, కాదు 10 సంవత్సరాలు కావాలని బీజేపీ చెప్పిందని, కానీ అధికారంలోకి వచ్చాక బీజేపీ అన్నింటినీ మర్చిపోయిందని ధ్వజమెత్తారు. దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఎన్‌డీఏకు ఇవి ఆఖరి రోజులని చాందీ వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూ, బీజేపీతో కలిసి నాలుగేళ్లు కాపురం చేసిన టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే బీజేపీతో విడిపోయి ప్రత్యేక హోదా అంటూ కేకలు పెడుతోందని, ఆందోళనలు చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో మమేకం కావడం కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలన్నారు. అన్ని రాష్ట్రాల్లో బూత్ కమిటీలు ఉన్నాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు లేవన్నారు. రాష్ట్రంలో 44,000 బూత్ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామని ఊమెన్ చాందీ అన్నారు. ఇవి కేవలం ఎన్నికల కోసమే కాదని, శాశ్వతంగా కొనసాగుతాయని చెప్పారు. బూత్ కమిటీలు పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తాయన్నారు. అధ్యక్షులు మాత్రమే ఉన్నందున మండల, పట్టణ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు, కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యం- ఇంటింటా సౌభాగ్యం కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ జయంతి నుంచి వర్ధంతి వరకు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 19 వరకు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా మంది సీనియర్ నేతలు ఉత్సాహం చూపుతున్నారన్నారు. ఇటీవల మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేరారని, టీడీపీ మాజీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కూడా చేరారన్నారు. ఎవరు వస్తామన్నా, తమ పార్టీ తలుపులు తెరిచే ఉంచామన్నారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న ఊమెన్ చాందీ