రాష్ట్రీయం

గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 23: గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కాటన్ బ్యారేజి నుంచి లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంపాలవుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి బ్యారేజి నుంచి ఇప్పటివరకు 419.84 టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలోకి పోయాయి. ఇదిలా వుండగా అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలో కూడా వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో కాటన్ బ్యారేజి వద్ద వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది.సోమవారం బ్యారేజి వద్ద 7.20 అడుగుల నీటి మట్టం నమోదైంది. నాలుగు ఆర్మ్‌లలోని మొత్తం 175 గేట్లను 1.50 మీటర్ల మేరకు ఎత్తివేసి 3 లక్షల 78 వేల 653 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు.

చిత్రం.సోమవారం కనిపించిన గోదావరి ప్రశాంత రూపమిది