రాష్ట్రీయం

ప్రాజెక్టులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. మొదట గోదావరి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోగా ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టులు వరద ప్రవాహంతో ఉరకలు వేస్తోన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ముందుగానే ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టు సాగులోకి వస్తుందని రైతన్నలు సంబరపడుతున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతం కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌ఎల్‌ఆర్) 1,705 అడుగులుకాగా 1,702 అడుగుల మట్టానికి చేరుకుంది. అలాగే నారాయణపూర్ డ్యామ్ పూర్థిస్థాయి నీటి మట్టం 1,615 అడుగులుకాగా 1,611 అడుగులకు చేరుకుంది. ఈ రెండు ప్రాజెక్టులు నిండిపోవడంతో ఎగువ ప్రాంతం నుంచి జలాశయాలకు ఇంకా వరద ప్రవాహం ఉండటంతో దిగువకు 1,77,150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. జూరాల ప్రాజెక్కు పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1044 అడుగులు నమోదు అయింది. జూరాల ప్రాజెక్టు ఇప్పటికే
నిండిపోవడంతో దిగువకు 1,58,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్ కూడా పూర్తిగా నిండిపోవడంతో ఆ నీరు కూడా శ్రీశైలం జలాశయంలోకి చేరుకుంటుంది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తినీటి మట్టం 1,633 అడుగులుకాగా ప్రస్తుతం 1,631 అడుగులకు చేరుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి దిగువకు 63,959 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 1,58,000, తుంగభద్ర నుంచి 63,959 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి ఉరకలు వేస్తుండటంతో వారం రోజుల్లో ఇది పూర్తినీటి మట్టానికి చేరుకోవచ్చని అంచన వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుతం 850 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం ఉండటంతో వారం రోజుల్లో పూర్తిస్థాయి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక గోదావరిపైనున్న ప్రాజెక్టుల్లో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,061 అడుగులకు చేరుకుంది. నిజాంసాగర్ నీటి మట్టం 1,405 అడుగులు కాగా 1,385 అడుగులకు, ఎల్‌ఎండి నీటి మట్టం 920 అడుగులు కాగా 881 అడుగులకు కడెం ప్రాజెక్టు 700 అడుగులుకాగా 697 అడుగులకు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం 485 అడుగులు కాగా 476 అడుగులకు చేరుకోవటంతో అటు గోదావరి, ఇటు కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ ఉట్టిపడుతోంది.