రాష్ట్రీయం

నీటమునిగిన సంగమేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 23: నల్లమల అటవీ ప్రాంతంలోని కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని లలితా సంగమేశ్వరుడు సోమవారం గంగ ఒడికి చేరుకున్నాడు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 851 అడుగులకు చేరుకోవడంతో కేవలం ఆలయ శిఖర భాగం మాత్రమే కనిపిస్తోంది. మంగళవారం ఉదయానికి అదికూడా పూర్తిగా నీట మునిగే అవకాశముంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ శ్రీశైల జలాల నుంచి బయటపడిన సంగమేశ్వరుడు ప్రత్యేక పూజలందుకుంటున్నాడు. ఆలయ పురోహితులు తెలకపల్లె రఘురామశర్మ ఆధ్వర్యంలో లలితా సంగమేశ్వర ఆలయంలో ప్రతి సోమవారం పూజలు నిర్వహించారు. ఈ ఏడాది అనుకున్న సమయానికంటే రెండు వారాలు ముందుగానే ఆలయం మళ్లీ జలాధివాసం కావడం విశేషం. ఆలయంలోకి ఆదివారం సాయంత్రం నుంచి నీటి చేరిక ప్రారంభమైంది. దాంతో ఆలయ పూజారి రఘురామ శర్మ వరద నీటిలో ఆలయానికి చేరుకొని వేపదారు లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక తొలి ఏకాదశి పర్వదినాన లలితా సంగమేశ్వరుడు పూర్తిగా గంగమ్మ ఒడికి చేరుకోవడంతో భక్తులు విశేషంగా చెప్పుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఆలయ శిఖర భాగం మాత్రమే కనిపిస్తుండటంతో పురాతన ఆలయ శిఖర పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీశైల జలాశయం ఎగువన ఉన్న నూతన ఆలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం భక్తుల ఆధ్వర్యంలో జరిపించారు. పురాతన ఆలయం గంగ ఒడికి చేరుకోవడంతో మళ్లీ దేవదారు శివలింగ దర్శనం కావాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.

చిత్రాలు..శ్రీ లలితా సంగమేశ్వర ఆలయ శిఖర పూజలు నిర్వహిస్తున్న ఆలయ పురోహితుడు
* శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయిన శ్రీ లలితా సంగమేశ్వర ఆలయం