రాష్ట్రీయం

రైతును తొక్కి చంపిన ఏనుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నగొట్టిగల్లు, జూలై 23: అడివి పందుల బారి నుంచి వేరుశనగ పంటను రక్షించుకోవడానికి వెళ్లిన ఓ యువ రైతు గజరాజుల బారిన పడి మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారు జామున చిత్తూరు జిల్లాలో జరిగింది. ఎర్రావారి పాల్యెం, కొటకాడి పల్లికి చెందిన రైతు వెంకటయ్య (42) ఆదివారం రాత్రి తన పొలంలో కాపలాకు వెళ్లి నిద్రించారు. సోమవారం మధ్యాహ్నం కూడా వెంకటయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెదుక్కుంటూ పొలం వద్దకు వెళ్లారు. మార్గమధ్యంలో ఓ చెట్టుపక్కన విగతజీవుడై ఉన్న వెంకటయ్యను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అతని శరీరంపై తీవ్రగాయాలు ఉండటం, ఆ ప్రాంతంలో ఏనుగు పాద ముద్రలు కూడా ఉండటంతో వెంకటయ్యను ఏనుగులు దాడి చేసి చంపి ఉంటాయని భావిస్తున్నారు. వెంకటయ్య శరీరాన్ని ఏనుగులు దాదాపు నుజ్జునుజ్జు చేశాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఆయన మృతి చెందిన తరువాత కూడా మృతదేహంపై తీవ్రంగా దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. సమాచారం అందిన వెంటనే అడిషినల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డి కే సింగ్, రెవెన్యూ అధికారులు, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని కుటుంబానికి రూ. 5 లక్షలు నష్టపరిహారం చెల్లించనున్నట్లు అడిషినల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డికే సింగ్ ప్రకటించారు. వెంకటయ్య మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.