రాష్ట్రీయం

అన్ని సీట్లకూ ఒంటరిగానే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 23: రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సీట్లకు ఒంటరిగా పోటీచేస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించడంతో పాటు సమర్థులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. సోమవారం కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జనసమితిని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామస్థాయి కమిటీల నుండి జిల్లాస్థాయి కమిటీల వరకు నియమిస్తామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేసే తెలంగాణ జన సమితికి పట్టం గట్టాలని ప్రజలను కోరారు. పైసలు ఇచ్చే వారికంటే మంచి పరిపాలన అందించే వారికే ప్రజలు మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. రైతులు, రైతుకూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పోరాడతామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలలో రైతుదీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశస్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ, అంటరానితనాన్ని నిర్మూలించి సమానత్వం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన పోరాటాల స్ఫూర్తితో ప్రజాసమస్యల పరిష్కారానికి తెలంగాణ జనసమితి పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన వలన ప్రజలు ఇబ్బందులకు గురతున్నారని, పరిపాలనను అన్నివర్గాలకు విస్తరింప చేయాల్సిన పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో తెలంగాణ జనసమితి నాయకులు గోపగాని శంకర్‌రావు, మల్లెల రామనాధం, వల్లాల భరత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.