తెలంగాణ

విభజన హామీలపై కేంద్రానికి నివేదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో తెలంగాణ రాష్ట్రానికి పొందుపరిచిన అంశాలను, హామీలు అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు సూచించారు. సోమవారం తెలగాణ టీడీపి అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింహులు, అమర్‌నాథ్ బాబు, సామ భూపాల్ రెడ్డి, పాల్వాయి రజనీ కుమారి, జి. బుచ్చిలింగం, నరోత్తం, టీ. వీరేందర్‌గౌడ్, ఎంఎన్ శ్రీనివాస్, టీఎన్‌టీయుసి అధ్యక్షుడు బీఎన్ రెడ్డి, అశోక్‌గౌడ్, శ్రీనివాస చారి, అనిల్ తదితరులు గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా నాలుగేళ్ళుగా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని వారు గవర్నర్‌కు తెలిపారు.

చిత్రం..గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నేతలు