రాష్ట్రీయం

పర్సన్ ఇంచార్జీలను నియమించడం తప్ప మరో మార్గం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: పదవీకాలం ముగుస్తున్న సర్పంచ్‌ల స్థానంలో పర్సన్ ఇంచార్జులుగా అధికారులను నియమించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లనే పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం చట్ట ప్రకారం సాధ్యం కాదని, న్యాయస్థానాలు కూడా అంగీకరించవని వారు చెబుతున్నారు. ఆగస్టు ఒకటితో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తున్నందున పర్సన్ ఇంచార్జీల నియామకంపై కసరత్తు చేసిన అధికారుల బృందం ప్రగతి భవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిసి వివరించింది. కొత్త గ్రామ పంచాయతీల మనుగడ, పర్సన్ ఇంచార్జీల నియామకం తదితర అంశాలపై మంగళవారం సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పర్సన్ ఇంచార్జీలను ఎందుకు నియమించాలో, చట్టం ఏమి చెబుతుందో అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియగానే కొత్త చట్టం అమలులోకి వస్తుందని చట్టంలో పేర్కొన్నారు. 2వ తేదీ నుంచి కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి వస్తాయి. అలాగే ప్రస్తుతం ఉన్న పంచాయతీల స్వరూపం పూర్తిగా మారిపోవడం, సర్పంచుల పరిధి కూడా మారుతుందని పేర్గొన్నారు. మున్సిపాల్టీలుగా మారినా, మున్సిపాల్టీలో కలిసిన గ్రామాలకు సర్పంచ్‌లు పర్సన్ ఇంచార్జీలు వ్యవహరించడం ఎట్టి పరిస్థితిలో కుదరదని అధికారులు వివరించారు. కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి రానుండటంతో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు యధావిధిగా ఉండేవి కేవలం 5 శాతం లోపు మాత్రమేనన్నారు. ప్రస్తుత సర్పంచ్‌ల పరిధి ఇక ముందు ఉండక పోవడం వల్ల పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం కూడా అసంబద్ధంగా ఉంటుందని అధికారులు వివరించారు. ఈ కారణాల నేపథ్యంలో సర్పంచ్‌లను పర్సన్ ఇంచార్జీలుగా నియమించలేని అసహాయ పరిస్థితి ప్రభుత్వానిదని, అధికారులనే పర్సన్ ఇంచార్జీలుగా నియమించి చట్టప్రకారం ఏర్పడిన కొత్త పంచాయతీలను మనుగడలోకి తేవడమే ప్రభుత్వానికున్న మార్గమని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
గ్రామాలను తీర్చిదిద్దాలి
ఆగస్టు 2 నుండి రాష్ట్రంలో కొత్త పంచాయతీలు మనుగడలోకి వస్తున్న సందర్భాన్ని అవకాశంగా తీసుకుని గ్రామాలను బాగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలనీ, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు పర్సన్ ఇన్‌చార్జిలు వస్తున్నారని, ప్రతి గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి కచ్చితంగా ఉండేలా కొత్తగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. పర్సన్ ఇన్‌చార్జిలు, గ్రామ కార్యదర్శులు ఇద్దరూ గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. గ్రామాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి వీలుగా పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శికి విచక్షణాధికారాలను వినియోగించడానికి జిల్లాకు కోటి రూపాయిలు చొప్పున 30 కోట్ల రూపాయిలు అందుబాటులో ఉంచుతామని అన్నారు. పర్సన్ ఇన్‌చార్జిలు, పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి సీఎం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కొత్తగా వచ్చే పర్సన్ ఇన్‌ఛార్జిలు గ్రామ కార్యదర్శులు ప్రస్తుతం గ్రామం ఎలా ఉంది? మూడేళ్ల తర్వాత గ్రామం ఎలా ఉండాలి ? మూడేళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి అనే విషయంపై కార్యాచరణ ఇవ్వాలని అన్నారు. వాటి అమలును ఎప్పటికపుడు పర్యవేక్షించాలని, కొత్తగా నియమితులయ్యే గ్రామ కార్యదర్శులకు మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని, వారికి ఏఏ పనులు చేయాలనే విషయంలో మార్గదర్శనం చేయాలని అన్నారు. వారికి అప్పగించిన పనులను ఎప్పటికపుడు మూల్యాంకనం చేయాలని అన్నారు. బాగా పనిచేసిన వారిని రెగ్యులరైజ్ చేయాలని పని తీరు బాగులేని వారిని తొలగించాలని అన్నారు. గ్రామాల్లో చెట్లను పెంచడం, నర్సరీలు ఏర్పాటు చేయడం, స్మశాన వాటిక నిర్మించడం, డంప్ యార్డులను ఏర్పాటు చేయడం, పన్నులు వసూలుచేయడం వంటి పనులకు సంబంధించి చార్టు రూపొందించాలని సీఎం సూచించారు.
27న మంత్రిమండలి సమావేశం
ఈ నెల 27న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.