తెలంగాణ

అధికారంలోకొస్తే.. లక్ష ఉద్యోగాలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 24: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ. 3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించా రు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ చైతన్యయాత్ర మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక వాణిజ్యభవన్ కూడలిలో జరిగిన సభకు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు చేపట్టిన ఉద్యమాలకు స్పందించి ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే కేసీఆర్ తాను సాధించినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తర్వాత ఇచ్చిన హమీలను విస్మరించారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగమని ప్రకటించిన కేసీఆర్ ఊరికో ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో పలు శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 20 వేల ఉద్యోగాలను కూడా నేటివరకూ కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. నాలుగేళ్లలోనూ కేసీఆర్ ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగులు, మహిళలు, పేదలు అన్నివర్గాల ప్రజలను మోసగించిన కేసీఆర్ మాయమాటలను నమ్మేస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే రైతులకు రెండు లక్షల రుణామాఫీ చేయడంతో పాటు వరికి 2వేలు, పత్తికి 6వేలు, మిర్చికి 10వేల చొప్పున మద్దతు ధర కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆ పదవిని చేపట్టేందుకు అర్హుడు కాదని పొరపాటున మంత్రి అయ్యారని విమర్శించారు. సూర్యాపేటలో కలెక్టరేట్ భవన స్థల సేకరణలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఇందులో ఈ వ్యవహారంలో మంత్రికి సంబంధం ఉందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ నిరుద్యోగులను మోసగించిన కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు, టీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఈ యాత్ర విజయవంతానికి కారణమన్నారు. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇస్తూ సాంకేతిక సాకుతో తిరిగి నిలిపివేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేసి తిరిగి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఉత్తమ్ తన ప్రసంగంలో వచ్చే ఎన్నికల్లో దామోదర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వాఖ్యలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే స్థానాన్ని ఆశిస్తున్న పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి మనస్తాపంతో కార్యక్రమం నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఉత్తమ్ వాఖ్యల పట్ల పటేల్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.