తెలంగాణ

కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా సామాజిక కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నేతలు రాష్టవ్య్రాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పేదలు, రోగులకు పండ్లు పంపిణీ, రక్తదానం, మొక్కలు నాటడం వంటి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. తన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు, పోస్టర్లు, బోకేలు, పూల దండలకు ఖర్చు పెట్టే డబ్బులను సీఎం సహాయ నిధికి విరాళంగా ఇవ్వాల్సిందిగా కేటీఆర్ చేసిన సూచన మేరకు చాలా చోట్ల హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు మొక్కలు నాటగా, పార్టీ శ్రేణులు రక్తదానం చేసారు. శాసనమండలిలో నిర్వహించిన వేడుకలకు మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు కర్నే ప్రభాకర్, రాములు నాయక్, బి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.
వేడుకలకు కేటీఆర్ దూరం
మంత్రి కేటీఆర్ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు. ఎక్కడా ఈ కార్యక్రమాలకు హాజరుకాలేదు. జ్వరం కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నట్టు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలని ఉన్నా...ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నట్టు’ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.