రాష్ట్రీయం

నాలుగో విడత హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటిన లాంఛనంగా ప్రారంభించే గజ్వేల్ పట్టణంలో లక్షా 116 మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీటికి అదనంగా అదేరోజు అటవీ భూముల్లో మరో 20 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా జరిగే ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, మహిళలు, యువత, ప్రజలు భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. హరితహారం నాలుగో విడత కార్యక్రమంపై ప్రగతిభవన్‌లో బుధవారం మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున లక్షా 116 మొక్కలు నాటాల్సి ఉండటంతో విద్యార్థులు, స్వయం సహాయక బృందాలను సమీకరించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని రకాల రోడ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆవరణ, గుడి, మసీదు, చర్చి తదితర వాటితో పాటు ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలనని సీఎం పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సరిపడ మొక్కలను అందుబాటులో ఉంచాలన్నారు. ఆగస్టు ఒకటిన గజ్వేల్ పట్టణంలో ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసుకుంటున్నాం. ఆదాయాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి. జూన్ 2019 నుంచి పుష్కలంగా నీళ్లువస్తాయి. చెరువలన్నింటినీ కాలువల ద్వారా నింపుతాం. లక్షా 25 వేల కోట్ల పండుతుంది. వ్యవసాయం బాగుపడుతుంది. గురుకుల విద్యాలయాల ద్వారా మంచి విద్య అందుతుంది. రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతుంది. ఇంత చేసినా జీవించగలిగే పరిస్థితులు లేకుంటే దండుగే. మనిషి జీవించగలిగే పరిస్థితి కావాలి. భగవంతుడో, ప్రకృతో కావాల్సినవన్నీ సమకూర్చింది. కానీ, మనమే వాటిని చేజేతులా నాశనం చేసుకున్నాం. నాశనమైన వాటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అడవులను, పచ్చదనాన్ని తిరిగి పొందేందుకే హరితహారం అనే కార్యక్రమం చేపట్టాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. అధికార యంత్రాంగమంతా పచ్చదనం పెంచాలనే తపనతో పని చేయాలని, అటవీ భూముల్లో కూడా అడవిని పునరుద్ధరించాలని, మొక్కలు నాటడం, రక్షించడం ప్రధాన విధి కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నిధుల కొరతలేదని, ఉపాధి హామీ పథకం నిధులను వాడుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.