రాష్ట్రీయం

కాంగ్రెసేతర నియోజకవర్గాలపై నివేదికలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. అందులో భాగంగానే తమ పార్టీ ప్రాతినిథ్యం వహించని నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నది. కాంగ్రేసేతర నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులు ఏమిటీ?, అక్కడి ఇతర పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది?, ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి?, పార్టీ బలం, బలహీనతలు ఏమిటీ? తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి వెంటనే నివేదికలు అందజేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జీ బోసు బాబు పార్టీ సమన్వయకర్తలను ఆదేశించారు. బుధవారం గాంధీ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, చేవె ళ్ళ పార్లమెంటు నియోజకవర్గాల పరిథిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు, మాజీ మంత్రులు డీకె అరుణ, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నగర శాఖ అద్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రసంగిస్తూ ఎల్‌డిఎంఆర్‌సి నియోజకవర్గాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాలకు పార్టీ తరపున సమన్వయకర్తలను నియమించినట్లు చెప్పారు. నియోజకవర్గాల్లో ప్రధానంగా ఏఐసీసీ కీలకంగా భావిస్తున్న శక్తి ఆప్ నమోదు కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహించే సమయంలో ఆయా డీసీసీలకు సమాచారం ఇవ్వాలని, నిర్ణయించిన బాధ్యులందరినీ పిలిచి సమావేశాలు జరపాలని ఆయన వివరించారు. కుంతియా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను, అక్కడి ఎమ్మెల్యేల పని తీరును పరిశీలించేందుకు సమన్వయకర్తలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు మకాం వేయాలని ఆదేశించారు. తమకు కేటాయించిన బాధ్యతలను నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీరు ఇచ్చే నివేదికలు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని కుంతియా చెప్పారు.
ఏఐసీసీ ఇన్‌ఛార్జీ కార్యదర్శి బోసు బాబు ప్రసంగిస్తూ పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి బ్లాక్ వరకు కమిటీలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రం స్థాయి ఎజెంట్ల నియామకాలను వెంటనే చేపట్టాలని, అదేవిధంగా మండలాల సమావేశాలు, ఎగ్జిక్యూటివ్ సమావేశాలను నిర్వహించాలని అన్నారు. నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించాలని, అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేల పని తీరును గమనించి నవేదకల్లో పేర్కొనాలని అన్నారు.