రాష్ట్రీయం

‘బిల్ట్’ పునరుద్ధరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: తెలంగాణలో ఖాయిలా పడిన పరిశ్రమ మరొకటి పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి అక్కడి కార్మికులను ఆదుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) కంపెనీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పరిశ్రమల మంత్రి కే. తారకరామారావు సమావేశమయ్యారు. ఖాయిలా పడిన కంపెనీల కార్మికులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేటీఆర్ హామీ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయన్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గత ఏడు నెలలుగా ఆ కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులతోనూ, కంపెనీ కార్మికులతోనూ చర్చలు జరుపుతున్నారు. కార్మిక మంత్రి నాయని నర్సింహారెడ్డి, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్, ఏంపీ సీతారాం నాయక్, కార్మిక శాఖ అధికారులు, కార్మిక సంఘాల నేతలతో రెండేళ్ల నుండి పలు సమావేశాలు పెట్టి కమలాపూర్ రేయాన్స్ కంపెనీని పునరుద్ధరించాలని యాజమాన్యాన్ని కార్మికులు కోరుతున్నారు. కంపెనీ పునరుద్ధరణకు యాజమాన్యం తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం తరఫున కొన్ని రాయితీలు, సహకారం కావాలని కోరారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం కావాలో తెలిపే ప్రతిపాదనలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి , పరిశ్రమల మంత్రి కేటీఆర్ అడిగారు. ప్రతిపాదనలు సమర్పించగానే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఏమేం చేయగలమో చెబుతామని అన్నారు. ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని, కార్మికుల బతుకు కోసం ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోందని పేర్కొన్నారు. భూపాలపల్లిలో ఈ పరిశ్రమ పునరుద్ధరణ జరిగితే అక్కడ పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తవారికీ ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని, ఇందుకోసం ప్రభుత్వం తన సాయిశక్తులా సహకరిస్తుందని అన్నారు. వారం పది రోజుల్లో కంపెనీ పునరుద్ధరణపై తమ ప్రతిపాదనలను సమర్పిస్తామని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండి కంపెనీ పునరుద్ధరణకు చొరవ తీసుకోవడం, నేడు కంపెనీ దీనికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ఒడితల సతీష్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, కంపెనీ డైరెక్టర్ హరిహరన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.