రాష్ట్రీయం

ప్రతి ఓటూ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్ల, జూలై 26: సామాజిక, రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చకపోతే గూండాలు, ఫ్యాక్షనిస్టులు రాజ్యమేలతారని, ఈ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని జనసేనాధినేత పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. నిస్వార్థంగా సేవలందించే వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలన్నారు. రాజకీయాలు చేయాలంటే పెట్టి పుట్టక్కరలేదని సేవాగుణం, ధైర్యం, తెగింపు, సహనం ఉంటే చాలన్నారు. అర్థరాత్రి ఆడవారు రోడ్లపై తిరగలిగిన నాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ చెప్పారని, అయితే పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళల భద్రతే జనసేన ప్రధాన ఎజెండా అని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాళ్ల మండలం పెదమిరం గ్రామంలో గురువారం ఆయన విద్యార్థులు, జనసేన కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. భీమవరం డిఎన్నార్ కళాశాల విద్యార్థులు, భీమవరం, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల జనసైనికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2019 సంవత్సరంలో ఏపీ రాజకీయాల్లో ప్రతీ ఓటూ చాలా కీలకమని గుర్తుంచుకోవాలన్నారు. ఓటు వృథా కాకుండా యువత శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఎవరివైనా ఓట్లు తొలగించినట్టు గుర్తిస్తే, తిరిగి చేర్చేవరకూ పోరాడాలని సూచించారు. దురదృష్టవశాత్తు తుపాకీలతో కాల్చేసిన వాళ్లు, దోపిడీలు చేసిన వాళ్లు చట్టం నుండి తప్పించుకుని, మనమీద పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. బ్రోకర్ పనిచేసే వాళ్లు కోట్లు సంపాదిస్తుంటే పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వాళ్లు వారికింద పనిచేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఈ సమాజంలో మార్పు తీసుకురావాలనే రాజకీయాలలోకి వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు.
మంత్రి లోకేష్‌పై విసుర్లు
మంత్రి నారా లోకేష్ లాగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాలేదని పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏ పనిచేస్తే ఎంత వస్తుంది అనే స్వార్ధంతో మాత్రమే మంత్రి లోకేష్ వంటి వారు విధానాలు రూపొందిస్తారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలవల్ల సామాన్యుడు ఇబ్బంది పడకూడదన్నారు.
ఒకమాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకు కోపం, మాట్లాడకపోతే ఆంధ్ర వాళ్లకు కోపం ఇటువంటి పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. రాజకీయాల్లోకి రావడానికి ధైర్యం కూడగట్టుకోవడానికి దశాబ్దం పట్టిందన్నారు. కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి వచ్చానన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిలా తానూ తిట్టగలనని, తనకూ బలమైన నోరువుందని, గొడవ పెట్టుకోగలనని కానీ దానివల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. మరో 25 ఏళ్లు జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేయదల్చుకున్నానని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. అనంతరం ముస్లిం పెద్దలతో సమావేశమైన ఆయన వారి సమస్యలు విన్నారు. ఈ సందర్బంగా పవన్‌కు వారు పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని బహూకరించారు.
చిత్రం..విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి