రాష్ట్రీయం

గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూలై 26: ఆషాఢ పౌర్ణమి ఉత్సవంలో భాగంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో జరిగే సింహగిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే భక్తులు లక్షలాదిగా తరలివచ్చి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు జెండా ఊపి గురువారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు రథ ప్రదక్షిణను అధికారికంగా ప్రారంభించారు. దేవాలయ అనువంశిక ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు సతీమణి ముందుగా రథంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం మంత్రి గంటా, ప్రభుత్వ విప్ పీజీవీఆర్ నాయుడు (గణబాబు) స్వామివారిని దర్శించకున్నారు. దేవస్థానం ఈవో కే.రామచంద్రమోహన్ వీరికి స్వాగతం పలికి తొలిపావంచా వద్ద ప్రముఖులతో టెంకాయ కొట్టించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, నాదస్వర వాయిద్యాలు, కొలాట భజనలు, తప్పెటగుళ్ల బృందాల విన్యాసాల నడుమ రథం ప్రదక్షిణ ప్రారంభమైంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు గోవిందనామస్మరణ చేస్తుండగా వరాహ నారసింహుడి ధర్మప్రచార రథం కదిలింది. పాతఅడివివరం, హనుమంతువాక, జోడుగుళ్లపాలెం, అప్పూఘర్, ఎంవీపీ కాలనీ మీదుగా జాతీయ రహదారి చేరుకుని మద్దిలపాలెం, సత్యం సెంటర్, పోర్టు స్డేడియం, మురళీనగర్, ఎన్‌ఏడీ, గోపాలపట్నం మీదుగా రాత్రి పది గంటల సమయంలో రథం ప్రదక్షిణ పూర్తి చేసుకొని సింహాచలం చేరుకుంది. భక్తుల ప్రదక్షిణ ఉదయం నుండి ప్రారంభమైంది. ఆరు గంటలకే భక్తులు తొలిపావంచా వద్ద టెంకాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభించారు. మధ్యాహ్ననానికి రద్దీ పెరిగి రథ ప్రదక్షిణ సమయంలో ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. దేవస్థానం ఈవో కే.రామచంద్రమోహన్, డీసీపీ ఏఆర్.దామోదర్, ఏసీపీలు అర్జున్, కే.ప్రభాకర్‌తో పాటు పలువురు అధికారులు ప్రదక్షిణ ఏర్పాట్ల పై నిరంతరాయంగా పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. కొంత మంది భక్తులు గురువారం రాత్రికే సింహగిరికి చేరుకొని స్వామివారిని దర్శించుకోగా రాత్రాంత ప్రదక్షిణ చేసే భక్తులు శుక్రవారం ఉదయం నుండి సింహాచలేశుని దర్శనం చేసుకోనున్నారు.