రాష్ట్రీయం

సీన్ రివర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తర్వాత పొలిటికల్ సీన్ మారిపోయిది. ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరైతే,
ఒకప్పుడు ఆయన ఆప్తుడుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దూరమయ్యారు. ఈ పరిస్థితి ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మరింత ఆగాథాన్ని మరింత పెంచింది. ఈ తీర్మాన పరిణామం ఇరు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. అవిశ్వాస తీర్మానంపై అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ టీఆర్‌ఎస్ ఓటింగ్‌లో పాల్గొనక పోవడం, పరోక్షంగా బీజేపీకి సహకరించినట్టు అయింది. ఈ పరిణామం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షమైన టీడీపీకి మింగుడు పడడం లేదు. పైగా ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను టీఆర్‌ఎస్ ఎంపీలు, నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభజన హామీలు రెండు రాష్ట్రాలకు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి, ఏపీకి హోదా ఇస్తే, తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రత్యేక హోదాకు తామెలా మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ బీ. వినోద్ కుమార్ నిలదీశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, తమ కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి అవిశ్వాస తీర్మానం దాకా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఏన్డీయేకు టీడీపీ దూరం కాగానే టీఆర్‌ఎస్ దగ్గరయ్యేందుకు ప్రయత్నించిదన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి తమకు టీడీపీ దూరమైనందువల్ల టీఆర్‌ఎస్‌ను దగ్గరకు తీయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రధాన మంత్రి మోదీని ఉద్దేశించి గతంలో టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ నేపథ్యంలో ప్రధానిని కలువడానికి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు ఆయన అపాయింట్‌మెంట్ లభించలేదు. దీనితో ప్రధానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శాశ్వతంగా దూరమైనట్టేనని రాజకీయ వర్గాలు అంచనా వేసాయి. అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం కానీ, శాశ్వత శతృత్వం కానీ ఉండదని ఇప్పుడు మరోసారి రుజువవుతున్నది. తాజా రాజకీయ పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ దూరం కావడం, ప్రధాని మోడీకి దూరంగా ఉన్న టీఆర్‌ఎస్ దగ్గర కావడం చకచక జరిగిపోయింది. కేంద్రంలోని బీజేపీకి దగ్గరైతే టీఆర్‌ఎస్‌కు మైనారిటీలు దూరమయ్యే ప్రమాదం ఉండటంతో అవిశ్వాస తీర్మానం సందర్భంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వకపోయినప్పటికీ, తీర్మానం పెట్టిన టీడీపీకి కూడా మద్దతు ఇవ్వలేదు. దీంతో బీజేపీకి టీఆర్‌ఎస్ అనుకూలంగా వ్యవహరించిందన్న అపవాదు రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రం వాదనకు టీఆర్‌ఎస్ మద్దతు పలికింది. అంతేగాక, ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని టీఆర్‌ఎస్ మడత పేచి పెట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉన్న అంతరం అవిశ్వాస తీర్మానం తర్వాత మరింత పెరిగింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో ప్రధాన మంత్రి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రస్తావిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పరిణితి చెందిన నేతగా కొనియాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్య పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు పరిణితి లేదన్న అర్థమే వస్తుంది. ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధాని మోదీ కంటే ముందు సీఎంగా పని చేసిన తనకు పరిణితి లేదని అంటారా? అని చంద్రబాబు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ‘మొగడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు చూసినందుకన్న’ చందంగా చంద్రబాబు అవేదనకు కారణం అయి ఉండవచ్చు. ప్రధాన మోదీ ముందుస్తు ఎన్నికలకు సంకేతం ఇవ్వగా అన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ సీఎం కేసీఆర్ ఒక్కరే సానుకూలంగా స్పందించారు. మొత్తం మీద ఈ పరిణామాలన్నీ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వ అధినేతల మధ్య మరింత ఆగాధాన్ని పెంచింది.