రాష్ట్రీయం

‘సమ్మె’ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 26: రహదారులపై లారీల రాకపోకలు నిలిచిపోయి ఆరు రోజులు గడిచింది. ఏడవ రోజు అడుగిడుతోంది. లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయి సరుకుల రవాణాపై ప్రభావం చూపుతుండగా, సామాన్యులకు క్రమేణా కష్టాలు పెరుగుతున్నాయి. సమ్మె ప్రభావంతో నిత్యావసర ధరలు మోత మోగిస్తున్నాయి. సమ్మె ఇలాగే కొనసాగితే ధరలు మరింత దరువేసే అవకాశాలున్నాయి. పెట్రోల్ బంక్‌లు ఒక్కక్కటిగా నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. భవన నిర్మాణ రంగంపై కూడా ప్రభావం చూపుతోంది. ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మోటార్ల వర్కర్ల సంఘం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన దరిమిలా లారీల బంద్ కొనసాగుతోంది. ప్రధానంగా డీజీల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని, దేశవ్యాప్తంగా ఒకేధర ఉండాలని, మూడునెలలకొకమారు వాటిని సవరించాలని, దేశవ్యాప్తంగా గడువు ముగిసిన టోల్‌గేట్లను శాశ్వతంగా తొలగించాలని, పెంచిన థర్ట్ పార్టీ బీమా ప్రీమియం తగ్గించాలని, లారీ యజమానుల నుంచి టీడీఎస్ వసూలు చేయవద్దని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని, 2015లో చేపట్టిన సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రమాదాలు, ఓవర్ లోడ్ కేసుల్లో డ్రైవర్ల లైసెన్స్ రద్దు విధానాన్ని విరమించుకోవాలని, లారీలపై ఓవర్‌లోడ్ నిషేధించాలని, రవాణా, పోలీసు, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వేధింపుల నుంచి రక్షించాలని తదితర డి మాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 20 నుంచి సమ్మె బాట పట్టిన
సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 6వేల లారీలు ఉండగా, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయి సేద తీరుతున్నాయి. ఆరు రోజులుగా సరుకుల రవాణా నిలిచిపోవడంతో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు బరువెక్కుతున్నాయి. భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా కూలీలు అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ బంక్‌లు సైతం ఒక్కొక్కటిగా నో స్టాక్ బోర్డులు పెడుతుండగా, వాహనదారులు ఉన్నచోట క్యూ లైన్లు కడుతూ అవస్థలు పడుతున్నారు. ఇలా అన్ని రంగాలపై క్రమేణా ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రోజువారీ అవసరమయ్యే నిత్యావసర వస్తువులను మినహాయించిన లారీ అసోసియన్లు వాటిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అధికారుల వైపు నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తానికి సమ్మె ప్రభావంతో సరుకుల రవాణా నిలిచిపోవడంతో సామాన్యులకు క్రమేణా కష్టాలు పెరుగుతున్నాయి. కాగా, తమ సమస్యల్ని పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేదిలేదని, నేటి నుంచి పాలు, కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా కూడా నిలిపివేయనున్నట్లు లారీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్ తెలిపారు.