రాష్ట్రీయం

ఏ పార్టీ మంచి చేస్తుందో అదే నా పార్టీ: పరిపూర్ణానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 26: తెలుగు రాష్ట్రాల్లో తనకు ఏ పార్టీతో ప్రమేయం లేదని, అయితే ఏ పార్టీ ప్రజలకు మంచి చేస్తుందో ఆ పార్టీ నాది అని, ఎవరు మంచి చేస్తే వారి వెనుక నిలబడతానని పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా తిరుపతి శివారు కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామానగర్‌లో అంబేద్కర్ భవనం నిర్మాణానికి భూమి పూజకు ముఖ్య అతిథిగా దళిత సంఘాల ఆహ్వానం మేరకు పరిపూర్ణానంద స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ ఓ గొప్ప మహర్షి అని అభివర్ణించారు. భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో అన్ని మతాలవాళ్లూ హాయిగా బతుకుతున్నారంటే ఏకైక కారణం అంబేద్కర్ కృషి అని కొనియాడారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషి నిరుపమానమన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల్లో అందరి ఆశయాల స్ఫూర్తిగా అంబేద్కర్ మిగిలారని కొనియాడారు. దేశంలో దళితవాడ పేరు వినపడకుండా అన్ని కులాలు, మతాలు ఒకటిగా ఐక్యతతో అభివృద్ధి చెందినపుడే అంబేద్కర్ గొప్ప ఆశయాన్ని నెరవేర్చిన వారమవుతామన్నారు.