రాష్ట్రీయం

తిరుమల చరిత్రలో రికార్డు స్థాయి ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 26: ఏడుకొండల వెంకన్నకు టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా బుధ, గురువారాల మధ్య రూ.6.28 కోట్లు ఆదాయం లభించింది. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు, గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వచ్చిన కానుకలను లెక్కించారు. 24 గంటల వ్యవధిలో వచ్చిన ఈ కానుకల్లో మొత్తం రూ.6.28 కోట్లుగా టీటీడీ అధికారులు లెక్కలు కట్టారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజులో ఆదాయం లభించిన దాఖలాల్లేవు. 2012 జనవరి 3న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రూ.4.25 కోట్లు, వేసవి నేపథ్యంలో 2014 జూన్ 22న రూ.4.45 కోట్లు, 2016 జూన్ 26న రూ.4.22 కోట్లు, ఆగస్టు 1న రూ.4.24 కోట్లు ఆదాయం లభించింది. 2016 జూలై 11న 4.03 కోట్లు, అదే నెల 17వ తేదీన రూ.4.69 కోట్లు, అత్యధికంగా హుండీలో కానుకల ద్వారా ఆదాయం లభించింది. ఇప్పటివరకు అత్యధికంగా ఒకేరోజులో 2012 ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా టీటీడీకి రూ.5.73 కోట్లు ఆదాయం లభించి రికార్డు సృష్టించింది. తరువాత ఈ రికార్డులను అధిగమిస్తూ గురువారం రూ.6.28కోట్లు ఆదాయం హుండీ ద్వారా టీటీడీకి లభించింది. ఎవరో అజ్ఞాత భక్తుడు పెద్దమొత్తంలో హుండీలో కానుకలు సమర్పించడంతో ఆదాయం పెరిగినట్లు టీటీడీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలావుండగా గురువారం లభించిన రూ.6.28 కోట్లలో ఒక కోటి 64 లక్షల రూపాయల మేరకు నాణేలు, రూ.4.64 కోట్ల మేర కరెన్సీ ఉండటాన్ని అధికారులు లెక్కింపులో గుర్తించారు.
క్యూలైన్లు బంద్
సంపూర్ణ చంద్రగ్రహణం 27వ తేదీ రాత్రి ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి భక్తులను క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్‌లలోకి అనుమతించలేదు. గ్రహణం ప్రారంభానికి 6గంటలు ముందు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మరుసటి రోజు శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించి భక్తులను అనుమతిస్తారు. 28 ఉదయం 10 గంటల నుంచి భక్తులను కంపార్ట్‌మెంట్స్‌లోకి అనుమతించనున్నారు. కాగా 27వ తేదీ శుక్రవారం వృద్దులు, వికలాంగుల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.