రాష్ట్రీయం

యశ్వంత్‌పూర్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యశ్వంత్‌పూర్ - విశాఖపట్నంల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడిపాలని దక్షణ మధ్య రైల్వే నిర్ణయించింది. 06579/06580 నెంబర్లు గల ట్రైన్లు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 21 వరకు ప్రతి శుక్రవారం యశ్వంత్‌పూర్‌లో సాయంత్రం 6:35గంటలకు బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:35 నిమిషాలకు విశాఖపట్నం చేరకుంటోంది. తిరుగు ప్రయాణం ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 30ల మధ్య ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:45 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 9:05 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటోంది. ఈ రైళ్లను బనసవాడి, కృష్ణరాజాపురం, బంగర్‌పేట్, కుప్పం, జొలార్‌పేట్, కట్‌పాడి, రెణిగుంట, గుడూరు, నెల్లూరు, ఒంగోల్, చీరాల, తెనాలి, విజయవాడ, ఎలూరు, రాజమండ్రి, సామల్‌కోట్, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో నిలుపుతారు.