రాష్ట్రీయం

ఖగ్రాస చంద్ర గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూలై 26: చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళరేఖలో ఉన్నపుడు చంద్రునికి, సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణ కాలం చంద్రుని స్థాన కక్ష్య్యా బిందువులపై ఆధార పడి ఉంటుం ది. భూమిపై ఉండే వారికి చంద్రగ్రహణం కనపడితే, చంద్రుని పైనుం డి వీక్షిస్తే సూర్య గ్రహణం కనపడుతుంది. ఇది ‘పౌర్ణమి’నాడే కలుగుతుంది. సూర్యుని కాంతి భూమిపై పడినపుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగం ‘్ఛయ’. సూర్య కాంతికి కొద్ద్భిగం భూమిచే అడ్డగించ బడిన ప్రాంతం ‘ప్రచ్ఛాయ’. కనుక ఛాయ, ప్రచ్ఛాయల వల్ల పాక్షిక, సంపూర్ణ చంద్ర గ్రహణాలు సంభవిస్తాయి. ఒక సౌర లేదా చంద్ర గ్రహణం సంభవింపనున్నపు డు ఇతర రకాల గ్రహణాలు రెండు వారాల ముందు లేదా తర్వాత రావడం జరుగుతాయి. అంటే నెలలోపు 3గ్రహణాలు నెలకొంటాయి. ఈసారి జూలై 13న దక్షిణ ఆస్ట్రేలియా, పశ్చిమ న్యూజిలాండ్, అం టార్కిటికాలలో మాత్ర మే సూర్య గ్రహణం (ఖండగ్రాస) పాక్షికంగా ఉంది. అలాగే ఆగస్టు 11న ఉత్తర ఐరోపా, గ్రీన్‌లాండ్, రష్యా, చైనా, ఉత్తర పూర్వ ఆసియా ఖండంలో మరొక పాక్షిక సూర్య గ్రహణం ఉంది. జూలై 27న శుక్రవారం సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం ఈ శతాబ్దపు పొడవైన చంద్ర గ్రహణం. తదుపరి చంద్రుని యొక్క మొత్తం గ్రహణం 2019 జనవరి 20న జరుగనుంది. క్రీ.పూ.3000 నుండి క్రీ.శ.1999 వరకు ఐదు వేల ఏళ్ళలో 3479 సంపూర్ణ చంద్రగ్రహణాలు ఏర్పడగా, క్రీ.శ 318 మే 31న అత్యంత పొడవైన 106.6మీటర్ల చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక ప్రస్తుతం జూలై 27న ఆషాఢ శుక్ల పక్ష పూర్ణిమ శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్ర చతుర్థ చరణం -శ్రవణ నక్షత్ర ప్రథమచరణ మకర రాశి యందు మేష లగ్నమున కేతు గ్రస్త ఖగ్రాస చంద్ర గ్రహణం (సంపూర్ణ) సంభవించనుంది. శుక్రవారం రాత్రి 11.54గంటలకు గ్రహణ స్పర్శకాలం, రాత్రి 1.50గంటలకు మధ్యకాలం, 2.41గంటలకు ఉన్మీలన కాలం, శనివారం ఉదయాత్పూర్వం 3.49గంటలకు మోక్షకాలం అంటే మొత్తం గ్రహణకాలం 3.55గంటలు. ఇది 21వ శతాబ్దిలోనే అతిపెద్ద చంద్రగ్రహణంగా భావించ బడుత్నుది. భారతావనిలోని అన్ని ప్రాం తాలు, మొత్తం ఆసియా, యూరప్ ఖండాలు, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్, హిందూ, అట్లాంటిక్ మహా సముద్రములందు గ్రహణం గోచరమగుచున్నది. శుక్రవారం మద్యా హ్నం 12.45గంటల నుండి గ్రహణ వేధ ప్రారంభమై, గ్రహణ మోక్ష కాలం వరకు ఉండును. నిత్య భోజనాలు, పౌర్ణమీ ప్రయుక్త ప్రత్యాబ్దికములు ఆ లోపుగా పూర్తి చేసుకోవడం ఉత్తమం. బాలురు, వృద్ధులు, గర్భిణిలు, అనారోగ్యంతో ఉన్నవారు రాత్రి 7గంటల వరకు భోజనాలు ముగించడం, గ్రహణ స్పర్శ, మోక్ష కాలం మధ్యన నియమాలు పాటించడం మంచిది. మిథున, తులా, మకర, కుంభరాశుల వారు, గర్భిణులు చంద్ర గ్రహణాన్ని వీక్షించ కూడదు. నదీ స్నానం చేసి, దానధర్మాలు పరిపాటి. ‘‘ఓం క్షీర పుత్రాయ విద్మహే, అమృత తత్వా య ధీమహి, తన్నో చంద్ర ప్రచోదయాత్’’ అని గ్రహణ సమయంలో పఠించడం పుణ్యప్రదం.