ఆంధ్రప్రదేశ్‌

శాకంబరీ దేవి దర్శనానికి బారులు తీరిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జూలై 26: చిరుమందహాసంతో శోభిల్లుతూ పద్మంలో ఆశీనురాలై వివిధ ఫల పుష్పాదులతోపాటు కూరగాయలతో అలంకృతురాలైన శాకంబరీదేవిని దర్శించుకోవటానికి భక్తులు ఇంద్రకీలాద్రికి బారులు తీరారు. ఎంతోవిశిష్టతమైన అలంకారంతో ఉన్న ఈ చల్లని తల్లిని దర్శిస్తే మంచి జరుగుతుదన్న నమ్మకంతో గురువారం ఉదయం నుండే భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. వివిధ రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ప్రూట్స్, తదితర వాటినే సర్వాభరణాలుగా ధరించిన దుర్గమ్మను దర్శించుకోవటానికి భక్తులు వేకువ జామునుండే బారులు తీరారు. ఉదయం 6గంటల నుండి 9గంటల వరకు భక్తుల కొంత మేరకు స్వల్పంగా ఉన్నప్పటికీ క్రమంగా సంఖ్య పెరిగింది. తిరిగి సాయంత్రం 6గంటల నుండి రాత్రి 10గంటల వరకు అమ్మవారి సన్నిధిలో రద్దీ కనబడింది. దుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు బుధవారం నుండి ప్రారంభమైయ్యాయి. అంతరాలయంలో శాకంబరీదేవి అలంకారంతో ఉన్న దుర్గమ్మను దర్శనం చేసుకున్న భక్తులు శ్రీ మల్లికార్జున మహామండపంలో 7 అంతస్తులో 3చోట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తులను దర్శనం చేసుకున్నారు. ఈ మహోత్సవాల సందర్భంగా వివిధ రకాలైన కూరగాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన కదంబం ప్రసాదాన్ని భక్తులకు ఈవో దంపతులు చేతుల మీదుగా ప్రారంభించారు. రద్ధీని దృష్టిలో పెట్టుకొని ధర్మకర్తలందరూ అమ్మవారి సన్నిధిలోనే ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించటంతోపాటు భక్తులకు సేవలు అందించారు. ఆధ్యాత్మిక సంస్థల కమిటీ సభ్యులు అమ్మవారి సన్నిధిలో ఉదయం కోలాటం, భజనలు, తదితర వాటిని కార్యక్రమాలను నిర్వహించారు. శాకంబరీ ఉత్సవాలు సందర్భంగా రెండో రోజైన గురువారం రాత్రి 9గంటల సమయానికి సుమారు 50వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. 4000 కేజీల కదంబం ప్రసాదాన్ని భక్తులకు సిబ్బంది పంపిణీ చేశారు.