రాష్ట్రీయం

డెల్టాలో బెంగాల్ తరహా వరినాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 28: గోదావరి డెల్టాలో పశ్చిమ బెంగాల్ తరహా వరినాట్లు పడుతున్నాయి. గత రెండేళ్ల నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు గోదావరి జిల్లాల్లో వరి ఊడ్పుల పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఉపాధి హామీ పథకం కారణంగా కూలీల కొరత ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఇక్కడి కూలీలు అధిక కూలీ తీసుకుంటున్నారని రైతుల్లో వ్యవసాయ ఖర్చులపై బెంగపట్టుకుంది. ఈ నేపధ్యంలో ఎలా ఈ నేల అలవాటైందో తెలియదు గానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు వరి నాట్లు వేయడంలో ఇక్కడి రైతులకు అలవాటయ్యారు. దీంతో ఏటికేడాది వేలాది మంది పశ్చిమ బెంగాల్ కూలీలు గోదావరి జిల్లాలకు వరి నాట్ల కాలంలో వలస వస్తున్నారు. గతంలో ఇక్కడ కూలీ పనులు లేక మన కూలీలు ఇతర జిల్లాలకు వలసపోయే పరిస్థితి ఇపుడు అది కాస్తా రివర్సైంది. పశ్చిమ బెంగాల్ నుంచి కూలీలు వ్యవసాయ పనులకు ఇక్కడకు వలస వస్తున్నారు. కూలీల వల్ల వరి ఊడ్పులు జోరుగా జరగడంతోపాటు కూలీ ఖర్చు కూడా తగ్గిందని రైతులు అంటున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, గండేపల్లి, సీతానగరం, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ కూలీలు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 1500 మంది వరకు వస్తున్నారు. వీరంతా జట్లు జట్లుగా ఇక్కడకు వచ్చి పొలాల సమీపంలోనే మకాం ఉంటున్నారు. ఎకరం యూనిట్‌గా తీసుకుని నాట్లు వేసేందుకు కూలీ మాట్లాడుకుని ఎకరం రెండు మూడు గంటల్లో నాట్లు వేస్తున్నారు. గతంలో ఒక్కో స్థానిక కూలీకి గరిష్టంగా రూ.550ల చొప్పున ఇచ్చేవారని రైతులు అంటున్నారు. ఈ విధంగా ఎకరం ఊడ్పు చేసేందుకు సుమారు ఏడువేల రూపాయల వరకు ఖర్చయ్యేది. ఇపుడు బెంగాల్ కూలీలతో ఎకరానికి రూ.3200 నుంచి రూ.3500లకే ఒప్పుకుని ఎకరం రెండు మూడు గంటల్లో నాట్లు వేసేస్తున్నారు. ఈ విధంగా ఒక్కో జట్టు (పది మంది) రోజుకు పది ఎకరాల వరకు నాట్లు వేసేస్తున్నారు.