రాష్ట్రీయం

ప్రజా వంచన యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి పార్టీ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి తన కుమారుడు లోకేష్‌ను ప్రమోట్ చేసేందుకే జన చైతన్య యాత్రలు చేపడుతున్నారని ఆయన మంగళవారం పార్టీ నాయకులు కనుమూరి బాపిరాజు, గంగా భవానీ, జంగా గౌతమ్, రవిచంద్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవి జన చైతన్య యాత్రలు కాదు ప్రజా వంఛన యాత్రలని ఆయన దుయ్యబట్టారు. 12 లక్షల మందికి పెన్షన్లు తొలగించామని, కోటి మందికి తెలుపు రంగు రేషన్ కార్డులు, 20 లక్షల మంది ఇందిరమ్మ గృహ లబ్దిదారులకు బిల్లులు చెల్లించకపోవడం, 1340 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయామని, ఈ ఏడాదిలో కరవు ఉన్నా కేంద్రానికి నివేదిక పంపించలేకపోయామని ప్రజలను చైతన్యవంతం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన తుపాను, భారీ వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. కేవలం కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారని, మంత్రులు పర్యటించారని ఆయన విమర్శించారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైసా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. సుమారు 25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు పంపిణీ చేశామంటున్న 25 కిలోల బియ్యం, కందిపప్పు, చక్కెర తదితర నిత్యావసర వస్తువులు చాలా మందికి అందలేదని ఆయన తెలిపారు. రోజువారీ కూలీలు గత నెల రోజులుగా ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రఘువీరారెడ్డి విమర్శించారు.
ఇందిరమ్మ ఫొటో ఉంటే..
ఎవరి ఇళ్ళలోనైనా ఇందిరమ్మ ఫొటో, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో కనిపిస్తే ఆ కుటుంబాన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయాన్ని అందించే జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. తుపాను బాధితులకు సహాయం అందించడంలోనూ రాజకీయ కోణంలో చూడడం దురదృష్టకరమని అన్నారు. తుపాను సహాయక చర్యల కోసం 3 వేల కోట్లు కావాలని, అందులో వెంటనే వెయ్యి కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, తొలుత మీ వద్ద ఉన్న నిధులను ఖర్చు చేయాలని కేంద్రం సూచించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఖలేజా ఉంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఆనం సోదరుల రాజీనామాలను ఆమోదించినట్లు ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తిరుపతి-నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే తిరుపతి-నాందేడ్-పుణెలకు రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని పౌరసంబంధాల శాఖ ముఖ్య అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నం. 07403 ఈనెల 4న రాత్రి గం. 19:25లకు బయలుదేరి మరుసటి రోజు ఉ.గం. 07:15లకు కాచిగూడ చేరుతుందని, కాచిగూడ నుంచి గం. 07:30లకు బయలుదేరి గం. 13:40లకు నాందేడ్‌కు చేరుకుంటుందని తెలిపారు.
ఇదే మార్గంలోని రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, ధోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, బొల్లారం, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముఖేడ్ స్టేషన్‌లలో ఆగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా నాందేడ్-పుణె వయా మన్మాడ్‌లకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, నాందేడ్ నుంచి ఈ నెల 12న గం. 20:50కు బయలుదేరే రైలు మరుసటి రోజు గం. 09:20లకు పుణె చేరుతుందని వివరించారు. ఈ ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక తత్కాల్ చార్జీలు ఉంటాయని, ఈ మార్గంలోని పూర్ణ, పర్భాని, సెలు, పర్తూర్, జైనా, ఔరంగాబాద్, మన్మాడ్, కొపేర్‌గావ్, బెలాపూర్, అహ్మద్‌నగర్, దౌండ్ స్టేషన్లలో అగుతుందని పౌరసంబంధాల శాఖ అధికారి తెలిపారు.
ఎయిడ్స్ నివారణపై ర్యాలీ
ప్రంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాద్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించింది. ఎయిడ్స్ పట్ల ప్రయాణికులను చైతన్య పరచే కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులతోపాటు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.