రాష్ట్రీయం

గొర్రె దాటు పథకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమల సహకార సంఘాలకు అందిస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమ రవాణా.. రీస్లైకింగ్ దందాలకు అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. జిల్లాలో ఎక్కడో ఒకచోట సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి జిల్లా సరిహద్దులు దాటించే క్రమంలో పట్టుబడుతున్న ఘటనలు సాధారణంగా మారిన తీరు సమస్య తీవ్రతను చాటుతుంది. గత ఇరువై రోజుల వ్యవధిలోనే కనగల్, పెద్దవూరా, సాగర్, డిండి, దామరచర్ల, అర్వపల్లి, తిరుమలగిరి, మాడ్గులపల్లి తదితర మండలాల్లో వరుసగా సబ్సిడీ గొర్రెలు పట్టుబడిన ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పటిదాకా అధికారికంగానే 3,180గొర్రెలను అక్రమ రవాణాలో పట్టుకుని 33 మందిపై కేసులు నమోదు చేయడం గమనార్హం. ఇక బయటపడిన సబ్సిడీ గొర్రెల అక్రమ రవాణా ఘటనలు మినహాయిస్తే చెక్‌పోస్టుల కళ్లుగప్పి సరిహద్దులు దాటించిన గొర్రెలు ఎన్నో లెక్కలేకుండా ఉంది. రోడ్డు మార్గంలోనే కాకుండా సాగర్, కృష్ణానదుల మీదుగా సైతం సబ్సిడీ గొర్రెల అక్రమ రవాణా సాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తరలించి తిరిగి వాటిని ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులకు విక్రయిస్తున్న రీస్లైకింగ్ దందా నిరాటంకంగా సాగుతోంది. అధికారులు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లి కొనుగోలు చేసి తెచ్చిన గొర్రెలను జిల్లాలోని లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండగా వారివద్ద నుంచి దళారులు సదరు గొర్రెలను కొనుగోలు చేసి ఆంధ్రకు తరలిస్తున్నారు. అవే గొర్రెలను ఆంధ్ర నుంచి అధికారులు మళ్లీ కొనుగోలు చేసి జిల్లాలో కొత్త లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండటంతో రీస్లైకింగ్ పర్వం యథేచ్ఛగా సాగుతోంది. దీంతో అసలు గొర్రెలెన్ని, కొత్తగా పంపిణీ చేసిన, ఉత్పత్తి సాగించిన గొర్రెలన్ని, ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద ఉన్న గొర్రెలెన్ని అన్న లెక్కలన్నీ గోల్‌మాల్‌గా మారిపోయాయి.
సాగుతున్న తొలి విడత పంపిణీ..!
తెలంగాణలోనే ఎక్కువగా నల్లగొండ జిల్లాలో గొర్రెల పంపిణీ జరగాల్సివుండటంతో తొలివిడత పంపిణీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. జిల్లాలో 490 సంఘాలుండగా వీటికి సంబంధించిన సభ్యులు 6450 మంది సబ్సిడీ గొర్రెల యూనిట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తొలి విడతలో 32,353 మందికి, రెండో విడతలో 32,151 మందికి గొర్రెల పంపిణీ లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇప్పటిదాకా 402 గ్రామాల్లో 21,000 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. 75శాతం సబ్సిడీతో పంపిణీ చేసే ఒక్కో గొర్రెల యూనిట్‌లో 20గొర్రెలు, ఒక విత్తన పొట్టేలు ఉంటాయి. గొర్రెల యూనిట్ల పంపిణీకి ఇప్పటిదాకా 230 కోట్లు ఖర్చు చేశారు. పంపిణీ చేసిన గొర్రెలకు పుట్టిన గొర్రె పిల్లల సంఖ్య చనిపోయిన వాటిని మినహాయిస్తే ప్రస్తుతం 1,27,432గా ఉండటం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి విడతలో 16 వేల యూనిట్ల లక్ష్యానికిగాను 13,834 యూనిట్లను సరఫరా చేశారు. సూర్యాపేట జిల్లాలో 17,697 యూనిట్లకుగాను 9,474 యూనిట్లను పంపిణీ చేశారు. జిల్లాలో సరిహద్దు మండలాల మీదుగా సాగే రహదారుల మీదుగా గొర్రెల అక్రమ రవాణా సాగుతుండగా ఈ మార్గాల్లోని పోలీస్, చెక్‌పోస్టు సిబ్బందికి చేతులు తడుపుతున్న రీస్లైకింగ్ దందా దళారులు సబ్సిడీ గొర్రెలను దర్జాగా జిల్లా సరిహద్దులు దాటేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయా మార్గాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు చెక్‌పోస్టుల ఆకస్మిక తనిఖీలు సాగించి గొర్రెల రీస్లైకింగ్ దందాకు అడ్టుకట్ట వేయాలని లేదంటే మొదటి విడత మాదిరిగానే రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ సైతం రీస్లైకింగ్ బారిన పడి పథకం లక్ష్యాలు ప్రశ్నార్థ్ధకంగా మారనున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రాలు..తిరుమలగిరి, కనగల్‌లో పట్టుబడిన సబ్సిడీ గొర్రెల దృశ్యాలు

*పోలీసులు పట్టుకున్న సబ్సిడీ గొర్రెల వాహనం