రాష్ట్రీయం

రైతుల ఆదాయం పెంచేందుకు ప్రాంతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు అయ్యేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు హైదరాబాద్‌లో మంగళవారం ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వర్క్‌షాప్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్‌జిత్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి, ప్రారంభిస్తారన్నారు. ఈ ప్రాంతీయ వర్క్‌షాప్‌లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పాండిచ్చెరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీపాల నుండి వచ్చే అధికారులు పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున నీతి ఆయోగ్ అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు.
రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేసేందుకు వీలుగా ఒక విధాన పత్రాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని పార్థసారథి గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారని తెలిపారు. ఈ కమిటీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ సదస్సులు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో సదస్సు జరుగుతోందని పార్థసారథి తెలిపారు.