రాష్ట్రీయం

ఉత్కృష్ట విద్యాసంస్థలకు వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: దేశవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాలకు ఉత్కృష్ట విద్యాసంస్థల హోదా లభించింది. కనీసం 20 విద్యాసంస్థలను ఎంపిక చేసి వాటి అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే ఈ పోటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ విశ్వవిద్యాలయం కనీసం దరిదాపులలో లేదు. దేశవ్యాప్తంగా 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో కనీసం 50 విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ స్థాయి వర్శిటీలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళిక రచించింది. ఎంపిక చేసిన వర్శిటీలకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమినెన్స్ హోదా కల్పిస్తారు. ఈ హోదా పొందిన యూనివర్శిటీలకు అన్ని విషయాల్లో పూర్తి స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని ఇస్తారు. ప్రధానంగా ఈ వర్శిటీలు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వర్శిటీలతో సమానంగా పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ముందంజ వేసేందుకు సాంకేతికంగా ఉన్న అనుమతుల సమస్యల నుండి వాటికి విముక్తం చేస్తారు. మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్ గోపాలస్వామి, సౌత్ ఏషియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్వర్డు యూనివర్శిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ తరుణ్ ఖన్నా, యూనివర్శిటీ ఆఫ్ హోస్టన్ అధ్యక్షురాలు రేణు కఠార్ , ఐఐఎం లక్నో మాజీ డైరెక్టర్ ప్రీతం సింగ్‌ల అధ్యక్షతన వేసిన కమిటీ ఇమినెన్స్ యూనివర్శిటీల ఎంపికకు నియమించారు. ఇందుకోసం 114 దరఖాస్తులు వచ్చాయి. అందులో 74 దరఖాస్తులు ప్రభుత్వ యూనివర్శిటీల నుండి రాగా, 40 దరఖాస్తులు ప్రైవేటు యూనివర్శిటీల నుండి మరో 11 గ్రీన్‌ఫీల్డు ప్రాజెక్టుల నుండి వచ్చాయి. ఈ సందర్భంగా ఈ యూనివర్శిటీలు విద్యాత్మక ప్రణాళిక, ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ ప్రణాళిక, విద్యార్ధుల అడ్మిషన్ల ప్రణాళిక, పరిశోధన ప్రణాళిక, నెట్‌వర్కింగ్ ప్రణాళిక, వౌలిక సదుపాయాల ప్రణాళిక, ఆర్ధిక ప్రణాళిక, పరిపాలనా ప్రణాళిక, సుపరిపాలన ప్రణాళిక, లక్ష్యాలను కూడా సూచించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కమిటీ ఆరు విద్యాసంస్థలను ఎంపిక చేసింది. అందులో ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ, ఐఐఎస్‌సి బెంగలూరు , ప్రైవేటు రంగం నుండి పూనేలో ఏర్పాటు చేస్తున్న జియో ఇనిస్టిట్యూట్, బిట్స్ పిలానీ , మణిపాల్ విద్యాసంస్థలున్నాయి. సైమండ్స్ క్వాకరెల్ సంస్థ సర్వే ప్రకారం ఐఐటి ముంబై ప్రపంచ సంస్థల్లో 162వ స్థానంలో ఉండగా, ఐఐఎస్‌సీ 170, ఐఐటి ఢిల్లీ 172, మణిపాల్ 751-800 రేంజ్‌లో, బిట్స్ పిలానీ 801-1000 రేంజ్‌లో ఉన్నాయి. ఈ విద్యాసంస్థల ఫీజులను బోర్డు ఖరారు చేస్తుంది, దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు, అదే విధంగా విదేశీ విద్యార్ధులను ఆకర్షించేందుకు కూడా సొంతంగా ప్రణాళికలు రచించవచ్చు, సీట్లు పొందిన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులున్నట్టయితే వారికి బ్యాంకుల ద్వారా రుణసౌకర్యం కల్పిస్తారు.