రాష్ట్రీయం

ఇసుక రవాణా బకాయిలు రూ.100 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఇసుక రవాణా బకాయిల విషయంలో ప్రభుత్వ ధోరణి లారీ యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో అమలు చేసిన మీ ఇంటికే ఇసుక పథకంలో రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఇసుకను చేరవేసేందుకు ప్రైవేటు లారీ ఆపరేటర్లను ప్రభుత్వం వినియోగించుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఎ) సారధ్యంలో డ్వాక్రా సంఘాల పేరున స్టాక్‌పాయింట్లను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా డిఆర్‌డిఎ లారీ ఆపరేటర్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆపరేటర్లకు ప్రభుత్వం కోట్లలో బకాయిలు పడిందని లారీ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఈ బకాయిలు దాదాపు రూ.100 కోట్ల వరకూ ఉంటుందని లారీ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకూ ఉన్న నిబంధనలు రద్దుచేసి ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడమే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు ఇసుక తవ్వకం, విక్రయాలను అప్పగించింది. యూనిట్ ధరను రూ.550గా నిర్ణయించి, స్టాక్‌పాయింట్లు, లేదా నేరుగా రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతించింది. అయితే కొన్ని జిల్లాల్లో ఇసుక రీచ్‌లు దూరంగా ఉండటంతో స్టాక్ పాయింట్లకు ఇసుకను తరలించే బాధ్యతను డిఆర్‌డిఎ స్వయంగా చేపట్టింది. దీనిలో భాగంగా డిఆర్‌డిఎకి, లారీ ఆపరేటర్ల మధ్య ఒప్పందం కుదిరింది. రీచ్‌ల నుంచి ఇసుక తరలించగా, స్టాక్ పాయింట్ల నుంచి లబ్ధిదారులకు నేరుగా ఇసుక సరఫరా చేసేవారు. అయితే రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఇసుకను చేర్చేందుకు లారీ ఆపరేటర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డిఆర్‌డిఎ బిల్లులు చెల్లించలేదన్నది లారీ ఆపరేటర్ల ఆరోపణ. విశాఖ జిల్లాలో బోని, చోడవరం రీచ్‌లతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా ఇసుక నగరానికి చేరవేశారు. దీనికి సంబంధించి విశాఖ జిల్లాలో డిఆర్‌డిఎ లారీ ఆపరేటర్లకు రూ.5.6 కోట్ల మేర బకాయి పడింది. తూర్పుగోదావరి జిల్లాలో రూ.8కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇది ఒక్క విశాఖ జిల్లా సమస్య కాదని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయని జిల్లా క్వారీ లారీ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధి వెంకట రమణ పేర్కొన్నారు. మొత్తం రాష్ట్రంలో లారీ ఆపరేటర్లకు డిఆర్‌డిఎ ద్వారా రూ.100 కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉందన్నారు. బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని జిల్లాల్లోనూ లారీ ఆపరేటర్ల ఆసోసియేషన్ ద్వారా డిఆర్‌డిఎ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దీనిలో భాగంగానే మూడు రోజుల కిందట విశాఖ జిల్లా డిఆర్‌డిఎ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించగా ప్రభుత్వంతో చర్చించి బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్న హామీ తీసుకున్నామని వెంకటరమణ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో ఇసుక రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఇసుక రవాణా చేయగా, పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించే విషయంలో ఖజానాపై ఉన్న ఆంక్షలు సైతం లారీ ఆపరేటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా ట్రెజరీ లాలాదేవీల్లో చెల్లింపులపై పాక్షిక నిషేధం కొనసాగుతున్నందున విడుదలైన బిల్లులు కూడా అందట్లేదని లారీ ఆపరేటర్లు వాపోతున్నారు. ఇదే తీరు కొనసాగితే తాము రోడ్డెక్కాల్సి వస్తుందని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

మేం కనె్నర్రజేస్తే
ప్రభుత్వాలు పతనమే!
మా సహనాన్ని పరీక్షిస్తే ఖబడ్దార్
తిరుగుబాటు వస్తే ప్రభుత్వానిదే బాధ్యత
బిసి మేధావుల సదస్సులో వక్తల హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 6: జనాభాలో 54శాతం ఉన్న బిసి కులాలు ఏకమైతే ప్రభుత్వాలనే మార్చివేయగలవని, రాజకీయాలను శాసించే శక్తి తమకు ఉందన్న విషయాన్ని పాలకులు మరువరాదని బిసి మేధావుల సదస్సులో వక్తలు తీవ్రంగా హెచ్చరించారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని బిసి జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేయడం ఏ రకంగానూ న్యాయం కాదని, జనాభా ప్రాతిపదికన బిసిలకు సముచిత స్థానం కల్పించకపోతే ఉద్యమబాట పడతామన్నారు. కడప జిల్లా పరిషత్ సభాభవన్‌లో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఆదివారం బిసి మేధావుల ఐక్యవేదిక రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహించారు.
సదస్సుకు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదానందగౌడ్, మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ సుబ్బాచారి నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో యాదవుల సంఘం రాష్ట్ర నేత డి.గంగయ్యయాదవ్ ప్రసంగిస్తూ 139 బిసి కులాలవారు మొత్తం జనాభాలో 54శాతం ఉన్నారని తెలిపారు. కేవలం 12శాతం లోబడి వున్న కాపులను బిసిల జాబితాలో చేర్చడమంటే బిసిలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని అన్నారు. తొగట వీరక్షత్రియ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండారు శ్రీనివాసులు మాట్లాడుతూ ఓట్లకోసం, సీట్లకోసం బిసిలను అణగదొక్కేందుకే కాపులను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. నారుూ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుడు పి.గురుస్వామి మాట్లాడుతూ 139 బిసి కులాలకు ఒక్క పూట భోజనం చేసే పరిస్థితులు కూడా లేవని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిసిలకు తిరగబడటం తప్ప మరో మార్గం కనబడటం లేదని, అదే జరిగితే తర్వాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి డి జానకీరామ్ మాట్లాడుతూ సంచార జాతుల్లో బిసిలంతా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నిరక్షరాస్యులుగా ఉండి నేటికీ కులవృత్తులను నమ్ముకుని జీవిస్తుంటే వారికి ప్రభుత్వం చేయూతనివ్వకపోగా, అన్ని రంగాల్లో అగ్రస్థాయిలో ఉన్న కాపులను బిసిల్లో చేర్చాలనుకోవటం ఏమిటని ధ్వజమెత్తారు. రజక సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి గురుమూర్తి మాట్లాడుతూ కాపులకు భయపడి ప్రభుత్వం మంజునాథ కమిటీని వేసిందని అన్నారు. నూర్‌బాష్ సంఘం మహిళావిభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డి.సుభాని మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం పాలకులు బిసిలను విభజింజి పాలిస్తున్నారని, మంజునాథ కమిటీని అడ్డుకుని తీరుతామని చెప్పారు. జంగం దేవర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి నగేశం మాట్లాడుతూ బిసిలకు 10 ఫెడరేషన్లు ఉండగా అన్నింటికీ కలిపి జిల్లాకు రూ.3కోట్లు రుణాలు మంజూరు చేయగా, అత్యంత స్వల్పంగా ఉన్న కాపు జనాభాకు రూ.15కోట్లు రుణాలు మంజూరు చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. బిసి-సి రాష్టన్రేత ప్రకాష్‌రావు మాట్లాడుతూ బిసిలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రాజకీయాలను శాసించే దమ్ము, ధైర్యం బిసిలకు ఉందని అన్నారు. ఈ సదస్సులో బిసి మేధావుల సదస్సు కో-కన్వీనర్లు బంగారు వెంకటరమణ, సగిలి సుబ్బరాయుడు, నూర్‌బాష్ సంఘం రాష్ట్ర నేత రాజేష్, అడహక్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర, జిల్లా బిసి నేతలు, తదితరులు పాల్గొన్నారు.