రాష్ట్రీయం

నా బోనం నాకిచ్చారు మీరు చేసిందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరలో అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురుచూసిన రంగం ఈసారి అంతే ప్రత్యేకతను సంతరించుకుంది. బంగారు బోనం సమర్పించినందుకు సంతోషించావా అని ఆలయ ప్రధాన పూజారి ప్రశ్నించినప్పుడు ‘నాబోనం నాకిచ్చారు? మీరు చేసిందేమిటి’ అని అమ్మమాటగా భవిష్యవాణిని వినిపించిన స్వర్ణలత అన్నారు. తన బంగారంతో బోనం సమర్పించారని, ఎవరూ సొంతంగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నావద్దకు సంతోషంతో కాకుండా పుట్టెడు దుఃఖంతో వస్తున్నారు. తిరిగి అదే దుఃఖంతో తిరిగి వెళ్తున్నారు. ఇది మంచిది కాదు’ అని శ్రీ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి దేవాలయం ఆవరణలో జరిగిన ‘రంగం’ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. తన భక్తులు సంతోషంగా ఉంటేనే తానూ సంతోషంగా ఉంటానని స్పష్టం చేశారు. బంగారు బోనం తానే తయారు చేయించుకున్నానని వ్యాఖ్యానించారు. తన బంగారంతోనే తనకు బంగారు బోనం చేయించారి అన్నారు. బంగారు బోనం సమర్పించినా, తాను ఇంకా దుఃఖంలోనే ఉన్నానని అనడంతో అక్కడ ఉన్న అధికారగణంతోపాటు భక్తులు కూడా నివ్వెరపోయారు. ‘మీరు ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నేను వారిని సంతోషంగా చూసుకుంటాను. నేను ఎపుడూ శాపం పెట్టలేదు’ అన్నారు. న్యాయం ఉన్నంత వరకు తానూ న్యాయం పక్షానే నిలుస్తానని, కానీ, తప్పు చేసే వారిని శిక్షిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పంటలు బాగా పండి, ప్రజలు సంతోషంగా ఉంటారని అనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బంగారు ముక్కుపుడక, బంగారు ఖడ్గాన్ని సమర్పించినందుకు కొంత ఆనందంగా ఉందని అమ్మ మాటగా స్వర్ణలత అన్నారు. ఆమె భవిష్యవాణి విన్పించినంత సేపు లక్షలాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఆలకించారు.