రాష్ట్రీయం

పాలన సులభతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 30: రాష్ట్రంలో పాలనను మరింత సులభతరం చేయడానికి హెల్త్‌టెక్, అగ్రిటెక్‌లను అందుబాటులోకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి తెలిపారు. త్వరలో కొత్త ఐటీ విధానాన్ని తీసుకురానున్నామని ఆయన అన్నారు. వారం రోజులపాటు విశాఖలో జరిగే వైజాగ్ స్టార్టప్ సమ్మిట్ 2.0 సదస్సును ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) మంజూరు చేస్తామని చెప్పినా ఆచరణ కాలేదని, అందువల్ల దానికి సమానమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ నిర్ణయం వల్ల ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెద్దఎత్తున రాష్ట్రానికి రానున్నాయన్నారు. ప్రపంచంలో ఉన్న ఫిన్‌టెక్ సిటీల్లో విశాఖ ఐదవ స్థానంలో ఉందని, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగంలో మొదటి మూడు స్థానాల్లో ఉందని చౌదరి తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్ ఎసెట్స్‌ను బ్లాక్‌చైన్‌కి మార్చే ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. బ్యాంకింగ్ రంగం కూడా ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెచ్చిందని చెప్పారు. పాలనను మరింత సులభతరం చేసేందుకు అగ్రిటెక్, హెల్త్‌టెక్‌లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఏపీఐటీఏ అడిషనల్ సీఈవో విన్నీపాత్రో, నాస్కామ్ ప్రతినిధి రఘురాం తదితరులు పాల్గొన్నారు.