రాష్ట్రీయం

దగాకోరు కేంద్రాన్ని వదలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 30: పార్లమెంటులో హామీలిచ్చి, ఇప్పుడు ఏమీ చేయలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన దగాకోరు కేంద్రాన్ని వదలొద్దని టీడీపీ ఎంపీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీలో ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు ధర్మపోరాటం విజయవంతమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదుకోట్ల మంది ప్రజల ఆశలన్నీ పార్లమెంటుపైనే ఉన్నాయి.. ప్రజల దృష్టి మన ఎంపీల పోరాటంపై ఉందన్నారు. పార్లమెంటులో ప్రతి అంశాన్ని వినియో గించుకోవాలని సూచించారు. విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలుపై పట్టుపట్టాలన్నారు. ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న బీజేపీ నేతల మోసాన్ని, ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కడప ఉక్కు తరహాలోనే త్వరలో విశాఖ రైల్వేజోన్‌పై కూడా పోరాటం తీవ్రతరం చేయాల్సి ఉందన్నారు. రాజధాని నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్, అన్నింటిపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలన్నారు. ఒకవైపు ప్రజాక్షేత్రం..మరోవైపు పార్లమెంటులో అన్ని వైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని వేదికలపై బీజేపీ మోసాన్ని ఎండగట్టాలన్నారు. కాపు రిజర్వేషన్ల చట్టం కేంద్రం వద్ద తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉంది.. రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చేవిధంగా ఒత్తిడి పెంచాలన్నారు. కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఈ విషయం అఫిడవిట్లలోనే తేలిపోయిందన్నారు. కేసుల మాఫీపై తప్ప ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలు పట్టవని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై జగన్ చేస్తున్న మోసాన్ని నిలదీయాలని సూచించారు. ఎస్సీలు, ముస్లిం మైనారిటీలు బీజేపీకి పూర్తిగా దూరమయ్యారని, అలాంటి బీజేపీతో జగన్ అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశం నిమ్జ్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. నిమ్జ్‌కు భూములు, విద్యుత్, నీరు అన్నీ అందిస్తున్నాం.. అయినా కేంద్రం నాలుగేళ్లుగా నాన్చుతోందని మండిపడ్డారు. ఎదురుదాడితో రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నదని, వాస్తవాలను పార్లమెంటు సాక్షిగా ప్రజలకు వివరించాలని ఎంపీలను కోరారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదిలేదని పునరుద్ఘాటించారు.