రాష్ట్రీయం

తుంగభద్రకు తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, జూలై 30: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద సగానికి సగం తగ్గిపోయింది. సోమవారం జలాశయానికి 33,375 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చింది. దీంతో జలాశయం 10క్రస్ట్ గేట్లు రెండు అడుగుర మేర ఎత్తి దిగువ నదిలోకి 26,092 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 94.61 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 1631.35 అడుగులుగా నమోదైంది. హెచ్చెల్సీకి 4.6 క్యూసెక్కులు, ఎల్లెల్సీకి 319 క్యూసెక్కులు, పవర్‌ప్లాంట్‌కు 350 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నిండుకుండగా తొణికిసలాడుతుండడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. బళ్ళారి, కొప్పళ, గదగ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకులు జలాశయం అందాలను చూసి పులకించిపోతున్నారు.