రాష్ట్రీయం

కాపు రిజర్వేషన్లపై జగన్ వైఖరి ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, జూలై 30: కాపులను బీసీల్లో చేర్చే విషయంలో జగన్ ఏ విధమైన వైఖరితో ఉన్నారో మరోసారి స్పష్టంచేయాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్‌చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగ్గంపేట సభలో జగన్ కచ్చితంగా చెప్పారని, దానిని తెలుగుదేశం వక్రీకరిస్తోందని వైసీపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అందువల్ల ఆ మాటలను తాను అనలేదనో లేదా కాపులకు న్యాయం చేస్తాననో, కాపుల రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నాననో జగన్ స్పష్టం చేయాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కాపుల రిజర్వేషన్లపై ప్రస్తుతం పలు వ్యాఖ్యలు చేస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉండి, రిజర్వేషన్ల కల్పనకు అవసరమైన కాపుల స్థితిగతులపై సర్వేకు నాడు రూ.40 లక్షలు విడుదలచేయించలేకపోయారని వ్యాఖ్యానించారు. ఆనాటి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని హామీయిచ్చి అధికారంలోకి వచ్చారనే విషయం బొత్స మర్చిపోయారా అని చినరాజప్ప ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటితే కష్టమని తెలుసని, కానీ కాపుల రిజర్వేషన్లపై శాసన సభలో తీర్మానం చేసి కేంద్రంతో పోరాడి సాధిస్తామని తాము చెప్పామన్నారు. అదేవిధంగా తీర్మానంచేసి కేంద్రానికి పంపించామన్నారు. ఏదేమైనా కాపులకు రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని చినరాజప్ప స్పష్టం చేశారు. విలేఖర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు.