రాష్ట్రీయం

కౌంటర్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: బంజారా, లంబడా, సుగాలీలను ఎస్టీ జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ కులాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాలకు, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ గిరిజనుల వివాదం పార్లమెంట్ పరిధిలో ఉందంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గోండ్వానా వెల్ఫేర్ సొసైటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై కేంద్రానికి ఏ.పీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్టల్రను కౌంటర్ దాఖలు చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

ఆనందపురం-అనకాపల్లి ఆరులైన్ల హైవే నిర్మాణం
న్యూఢిల్లీ, జూలై 30: విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు తలపెట్టిన ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం 30 మాసాలు (రెండున్నరేళ్ల)లో పూర్తివుతుందని రవాణా, రహదారులశాఖ సహాయమంత్రి మన్సుఖ్ మాండవీయ సొమవారం రాజ్యసభలో వెల్లడించారు. ఆనందపురం నుంచి పెందుర్తి మీదుగా అనకాపల్లి వరకు ఉన్న ప్రస్తుత రహదారిని ఆరు వరసల రహదారిగా విస్తరించాలంటూ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చాలా కాలం క్రితం ప్రతిపాదించినప్పటికీ, పనుల ప్రారంభించడంలో ఎందుకు విపరీతమైన జాప్యం జరిగిందంటూ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ పెందుర్తి మీదుగా ఆనందపురం నుంచి అనకాపల్లి రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరించే ప్రతిపాదనను ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆమోదించినట్టు చెప్పారు.

ప్రజాస్వామ్యం వేళ్లూనాలి
*ఇమ్రాన్‌కు మోదీ ఫోన్ విజయం పట్ల అభినందన
న్యూఢిల్లీ, జూలై 30: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ఖాన్‌తో భారతప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఇమ్రాన్ నేతృత్వంలో పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అత్యధిక సీట్లతో గెలుపొందడటం పట్ల ఇమ్రాన్‌ను మోదీ అభినందించారు. భారత్ ఇరుగుపొరుగు రాష్ట్రాలలో శాంతి, అభివృద్ధి విలసిల్లాలన్నదే తమ ఆశయమన్న విషయాన్ని ఇమ్రాన్‌తో జరిపిన సంభాషణల్లో మోదీ పునరుద్ఘాటించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.