రాష్ట్రీయం

థేశ వ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: పాఠశాల పూర్వ విద్య స్ధాయి నుండి జూనియర్ కాలేజీ వరకూ పటిష్టం చేసేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న మూడు కీలక పథకాల స్థానే కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఇంతకాలం సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఎ), టీచర్ ఎడ్యుకేషన్ (టిఈ) పథకాల స్థానే సమగ్ర శిక్షా అభియాన్‌ను తెచ్చింది. ఈ పథకం కింద ప్రీ స్కూల్ మొదలు ఇంటర్మీడియట్ స్థాయి వరకూ విద్యాభివృద్ధికి ఈ ఏడాది ఏప్రిల్ నుండి 2020 మార్చి 31 వరకూ 75వేల కోట్ల రూపాయిలను కేంద్రం వెచ్చించనుంది. ఇది ప్రస్తుతం కేంద్రం అమలుచేస్తున్న వ్యయానికి 20 శాతం అధికం. ప్రతి పాఠశాలలోనూ లైబ్రరీల అభివృద్ధికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికగా 5వేల రూపాయిల నుండి 20వేల రూపాయిల వరకూ ఇస్తారు. అలాగే కాంపోజిట్ స్కూల్ గ్రాంట్‌ను 25వేల నుండి లక్ష రూపాయిలకు పెంచారు. ప్రతి ఏటా క్రీడా పరికరాలకు ప్రాధమిక పాఠశాలలకు ఐదువేలు, యుపి స్కూళ్లకు 10వేలు, ఉన్నత పాఠశాలలకు 25వేల రూపాయిలు ఇస్తారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రతి ఏటా 3వేలు నుండి 3500 రూపాయిలు కేటాయిస్తారు. అమ్మాయిలకు ప్రతి నెల 200 రూపాయిలు స్ట్ఫైండ్ చెల్లిస్తారు. యూనిఫారం కోసం ఇచ్చే డబ్బులను 400 నుండి 600 రూపాయిలకు పెంచారు. పాఠ్యపుస్తకాలకు ప్రతి విద్యార్థికీ 250 మొదలు 400 రూపాయిల వరకూ ఇస్తారు. మరో పక్క స్కూళ్ల స్థాయిన కూడా పెంచే ప్రణాళికను రూపొందించారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల స్థాయిని 6 నుండి 12వ తరగతి వరకూ పొడిగించారు. ఉపాధ్యాయ విద్యా సంస్థలను పటిష్టం చేస్తారు. అన్ని స్కూళ్లలో డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా స్మార్టు క్లాసు రూమ్‌లు, డిజిటల్ బోర్డులు, డీటీహెచ్ చానళ్లను ఏర్పాటు చేస్తారు. తదనుగుణంగా ప్రతి రాష్ట్రం స్కూళ్ల వారీ ప్రణాళికలతో ముందుకు వస్తే దానికి వీలుగా కేంద్రం సమగ్ర శిక్షా అభియాన్ కింద నిథులను మంజూరు చేస్తుంది. దీనివల్ల విద్యార్ధుల సహ పాఠ్యప్రణాళిక అమలుకు, క్రీడాప్రోత్సాహానికి, శారీరక దారుఢ్యానికి , ప్రతి విద్యార్థిలో చైతన్యాన్ని నింపేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.