రాష్ట్రీయం

ప్రేమోన్మాదంపై ఆగ్రహావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో చోటుచేసుకున్న ప్రేమోన్మాదం ఘటనపై ఆదివారం జిల్లా కేంద్రం ఏలూరులో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆదివారం నాటి పరిణామాల్లో ఏలూరు ఆసుపత్రిలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శనివారం చోటుచేసుకున్న ఘటనలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రు యాదవ నగర్‌కు చెందిన పైడాల ఇందుమతి (17)పై ప్రేమోన్మాది చిన విక్కీ దాడి చేయడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, కాలిన గాయాలతో బాలిక ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మృత్యువాత పడటం తెలిసిందే.
కాగా ఆదివారం బాధితురాలి కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర మంత్రి పీతల సుజాత తదితరులు పరామర్శించారు. మరోవైపు ఆసుపత్రి వద్ద ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితురాలి కుటుంబ సభ్యులకు మద్దతుగా రజక సంఘాలు రంగంలోకి దిగాయి. అలాగే బాధితురాలు విద్యార్ధిని కావడంతో న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. ఆసుపత్రిలో బాధితురాలి తల్లిదండ్రులు, సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో నిందితుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట నెలకొంది. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేశాయి. కొద్దిసేపటికి పోలీసులు, రెవిన్యూ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపి శాంతింపచేశారు. కాగా ఒక దశలో బాలిక బంధువు ఒకరు అక్కడున్న వైరును పీకకు చుట్టుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తరువాత కూడా బాలిక మృతదేహాన్ని ఉంచిన ట్రాక్టర్‌తో ప్రభుత్వాసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అక్కడకు తరలించారు. కాగా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి బాధితురాలి కుటుంబాన్ని ఆసుపత్రిలో పరామర్శించడమే కాకుండా బాధితురాలి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆమె చాటపర్రు గ్రామం వెళ్లి ఘటనా స్థలంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఏలూరు
ప్రభుత్వాసుపత్రి
ఆవరణలో
ఇందుమతి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న రాష్ట్ర మహిళా
కమిషన్ చైర్‌పర్సన్
నన్నపనేని

ఎయు విసి రేసులో

హేమాహేమీలు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 6: ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్ పదవికి హేమాహేమీలు పోటీపడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ పదవి రేసులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి, వైస్ చైర్మన్లు నరసింహం, విజయ్‌ప్రకాష్‌తోపాటు జెఎన్‌టియు(కె) మాజీ వైస్ ఛాన్స్‌లర్ అల్లం అప్పారావు, ఎయు మాజీ విసి జిఎస్‌ఎన్ రాజు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు సభ్యుడు రొక్కం సుదర్శనరావు, అనిట్స్ ప్రిన్సిపాల్ విఎస్‌ఆర్‌కె ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఇన్‌ఛార్జి విసి ఇఎ నారాయణ, రిజిస్ట్రార్ వి.ఉమామహేశ్వరరావు, మాజీ రిజిస్ట్రార్ జెఎం నాయుడు, మాజీ ప్రిన్సిపాల్ ఎల్.కె. మోహన్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్ లా వర్శిటీ విశ్రాంత ప్రిన్సిపాల్ కేశవరావు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి కృష్ణయాదవ్, అంబేద్కర్ లా వర్శిటీ నుంచి కేశవరావు తదితరులు పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరికొంత మంది విసి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలో సామాజిక వర్గాలకు పెద్దపీట వేసింది. అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా నియామకాలు జరగడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ పదవిని ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారన్నది ఇతమిద్ధంగా తెలియడం లేదు. కాగా విసి పదవిని తమ సామాజికవర్గానికి చెందిన వారికే కేటాయించాలని కాపు, కమ్మ, యాదవ కులాలకు చెందిన నేతలు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. అనంతపురం జెఎన్‌టియు, లాలా లజపతిరాయ్, తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయం, నెల్లూరు సింహపురి, ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలో ఆయా సామాజికవర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. సెర్చ్ కమిటీ నియామకమైన నేపథ్యంలో వైస్ ఛాన్స్‌లర్ పదవి ఎవరిని వరించనుందో వేచి చూడాలి.

నారాయణ్‌పూర్‌లో ఎదురుకాల్పులు
ఇద్దరు కూలీలు దుర్మరణం
భద్రాచలం, మార్చి 6: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఆదివారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కూలీలు మరణించారు. నారాయణ్‌పూర్ జిల్లా ఆదాయ్‌ఘాట్ అడవిలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణపనుల భద్రతకు పోలీసులు పహారా కాస్తున్నారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ తొలుత మందుపాతర పేల్చారు. ఇంతలో పోలీసులు తేరుకుని నక్సల్స్ దాడిని ప్రతిఘటించారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణపు పనుల్లో ఉన్న కూలీలకు తూటాలు తగిలి, ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. నక్సల్స్ అడవుల్లోకి పారిపోయారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా గాయపడ్డారు. నక్సల్స్ కోసం సమీప అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.