రాష్ట్రీయం

ప్రపంచాభివృథ్ధికి ఐటీనే మూలాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31:ప్రపంచాభివృద్ధికి ఐటీనే మూలాధారమని జెఎన్‌టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. జెఎన్‌టీయూలో ఈ ఏడాది డిసెంబర్ 28, 29 తేదీల్లో కంప్యుటేషనల్ ఇంటిలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్‌పై నిర్వహించే అంతర్జాతీయ సదస్సు సన్నాహక సమావేశంలో వీసీ మంగళవారం నాడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిఎన్ భండారి, రెక్టార్ ప్రొఫెసర్ ఎ గోవర్థన్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ సాయిబాబారెడ్డి, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ బి పద్మజ రాణి , కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఆర్ శ్రీదేవి పాల్గొన్నారు. నేటి ప్రపంచం ముందు ఎప్పుడూ లేనివిధంగా టెక్నాలజీపైన ఆధారపడిందని , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే ప్రధమ మూలాధారమని అన్నారు. ఈ రంగాల్లో వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయని, పరిశోధకులు, ఉపాధ్యాయులు కొత్త ఆవిష్కరణలు చేయడంలో ఈ రంగం ముఖ్య పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఈమధ్య కాలంలో సాంకేతిక అభివృద్ధి , ఆవిష్కరణల వ్యాప్తిపైన దృష్టిసారించింది. భిన్న రంగాల్లోని పరిశోధకులను ఒక చోటుకు తీసుకురావడానికి, నూతన సాంకేతిక సమస్యలపై చర్చించడానికి కొత్త పరిష్కారాలతో కంప్యూటర్ సైన్స్ రంగంలో నూతన ఒరవడికి ఈ సదస్సు నాంది పలుకుతుందని ఆయన చెప్పారు.