రాష్ట్రీయం

గోల్డ్ సీజ్ కేసులు గాలికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలోని విమానాశ్రయాల్లో పట్టుబడిన బంగారం కేసులు గాలిలో దీపంలా మారుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ అవుతుందని కస్టమ్స్ అధికారులు అప్రమత్తతో పట్టుకుంటున్నప్పటికీ వాటి భద్రత, స్వాధీనం చేసుకున్న బంగారం ప్రభుత్వ ఖజానాకు చేరడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సేకరించిన సమాచారం ఈ విధంగా ఉంది. గత ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని పలు విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలించే 1408 మందిని అరెస్టు చేశారు. కానీ వారిలో కేవలం తొమ్మిది మందికి మాత్రమే శిక్ష పడింది. చెన్నైలోని అన్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన వారిలో నలుగురు, కోల్‌కటలో ఐదుగురికి శిక్ష పడింది. రూ. 663.53 కోట్లు విలువ చేసే 6.447.912 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 77 మంది అరెస్టు కాగా, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో 20 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 663.53 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే చట్టంలోని లొసుగుల వల్లనో, అవినీతి, అక్రమాలతోనో స్వాధీనం చేసుకున్న బంగారం ముంబైలోని మింట్‌కు తరలలేదని, స్మగ్లర్లకు తగిన శిక్షలు పడలేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం ఆర్థిక నేరాల కిందనే కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ముంబై, మధురై, గోవా, నాగపూర్ విమానాశ్రయాల్లో అసలు కేసులే నమోదైనట్టు దాఖలాలు లేవనే విమర్శ సర్వత్రా వస్తుంది. చట్ట ప్రకారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్న బంగారం ప్రభుత్వ ఖజానాకు తరలాలి. కానీ కోర్టుకు సరెండర్ చేయడం ద్వారా సదరు బంగారం స్మగ్లర్లు కోర్టుల్లో నామ మాత్రపు పెనాల్టి చెల్లించి విడిపించుకుంటున్నారని అభియోగాలు ఉన్నాయి. స్మగ్లర్లు మాత్రం బెయిల్‌పై విడుదలై మళ్లీ..మళ్లీ అదే వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కేసులు నమోదు చేస్తున్నామని ఈ విషయమై కస్టమ్స్ అధికారులను ప్రస్తావించగా ఓ సీనియర్ తెలిపారు.