రాష్ట్రీయం

నేను పెద్ద కూలీని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/ఎస్.రాయవరం, జూలై 31: ‘పనిచేయడంలో నేను పెద్ద కూలీని. నిద్రించే సమయం తప్ప మిగిలిన సమయమంతా కష్టపడుతూనే ఉంటా. అందుకే నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ముందుటా’నని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గుడివాడలో మంగళవారం నిర్వహించిన గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించిన అనంతరం గ్రామంలో పర్యటించి, రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో అనేక కష్టాలు ఎదురైనప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా ఆగకుండా చేస్తున్నామన్నారు. దాదాపు 42 సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని, దేశంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేజేస్తున్న ప్రభుత్వం మనదేనన్నారు. రాష్ట్ర జనాభా 5 కోట్లుకాగా, 1.4 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేశామని, 52 లక్షల సామాజిక పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపన మేరకు ఒకే ఇంట్లో అర్హులైన వారుంటే వారికి కూడా పింఛను ఇచ్చేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పల్లెల్లో సైతం ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి గర్భంలో శిశువు ప్రాణం పోసుకున్నప్పటి నుంచి మరణానంతరం అంతిమసంస్కారం చేసేంత వరకూ ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేయూతనిస్తోందన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పింఛన్లు దెయ్యాలు తీసుకునేవని, టీడీపీ అధికారం చేపట్టిన తరువాత పారదర్శకత తీసుకువచ్చామన్నారు. పింఛను దారుల ఇంటికే పింఛను మొత్తాలను పంపిణీ చేస్తున్నామన్నారు. కుటుంబ పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రమాద వశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సాధారణ మరణం సంభవిస్తే రూ.2 లక్షలు బాధిత కుటుంబానికి అందజేస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీఆర్‌ఓలు, హోంగార్డులు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు పెంచామని, వీరి ఆదాయాన్ని మూడు నుంచి నాలుగు రెట్లు పెంచడం ద్వారా ఖజానాపై ఆర్థికంగా భారం పడినా సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంతగా మిమ్మల్ని ఆదుకుంటున్నది ప్రజలకు సమర్ధవంతమైన సేవలందిస్తారన్న కారణంతోనేనన్నారు. అధికారులకు ఇంత చేస్తున్నది ప్రజలకు సుపరిపాలన అందించేందుకేనన్నారు. ఇటీవల ప్రారంభించిన అన్న కేంటీన్ల మంచి స్పందన లభించిందని, కేవలం రూ.5లకే అల్పాహారం, భోజనం అందించడం ద్వారా నిరుపేదలకు భరోసాకలిగిందన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ప్రతి వారం రెండు, మూడు గ్రామదర్శిని కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించానని, వచ్చే ఎన్నికల నాటికి 75 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. అధికారులు ప్రతి గురు, శుక్ర వారాల్లో నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. ఈ సందర్భంగా చంద్రన్నబీమా లబ్దిదారు, సాధికార మిత్ర, ఒంటరి మహిళ, పింఛను లబ్దిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడించి, వారి అభిప్రాయాలను గ్రామానికి వివరించారు.