రాష్ట్రీయం

పంచాయతీల్లో నేటి నుండి ‘ప్రత్యేక’ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో గురువారం నుండి ‘ప్రత్యేక పాలన’ ప్రారంభమవుతోంది. పాత గ్రామ పంచాయతీలతో పాటు, కొత్త పంచాయతీలకు కూడా ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. మండలస్థాయి అధికారులను పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా (స్పెషల్ ఆఫీసర్లు) గా నియమించారు. కొన్ని చోట్ల తహశీల్‌దారులను, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను (గిర్దావర్) స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. మండల కేంద్రాల్లో పనిచేసే వ్యవసాయం, విద్యాశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, సహకార తదితర శాఖల్లో పనిచేస్తున్న మండలస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మరికొన్ని చోట్ల అంగన్‌వాడీ కేంద్రాల సూపర్‌వైజర్లను, గ్రామస్థాయి అధికారులను కూడా నియమించారు. ప్రత్యేక అధికారులుగా నియామకం అయిన వారు గురువారం ఉదయం తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలకు వెళ్లి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. రిజిస్టర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీరు ఈ విషయాన్ని మండల పరిషత్ అధికారులకు (ఎంపీడీఓ) లిఖితపూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుంది. గ్రామ కార్యదర్శితో, పంచాయతీలోని ఇతర సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చిస్తూ, సంబంధిత పంచాయతీలో వౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ చూడాల్సి ఉంటుంది. కనీస అవసరాలైన తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, రోడ్లశుభ్రత, వీధిలైట్ల నిర్వహణ, హరితహారం, ఉపాధిహామీ పథకం తదితర పనులను పరిశీలించాల్సి ఉంటుంది. వారంలో కనీసం రెండురోజుల పాటు సంబంధిత గ్రామంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తమ తమ శాఖల పనులు చేసుకుంటూ, స్పెషలాఫీసర్ల బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సొంత శాఖ పనులు చేస్తూ, స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రత్యేక అధికారులకంతా రెండురోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకాధికారులుగా నియామకం అయినవారిలో చాలా మందికి పంచాయతీల్లో పనిచేసేందుకు సుతారమూ ఇష్టంలేదు. వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులకు రైతుబంధు, రైతు జీవితబీమా, పంటల బీమా తదితర పనుల్లోనే సమయం సరిపోవడం లేదని, వీరు పంచాయతీల్లో పనిచేసేందుకు సమయం కేటాయించడం కష్టమని తెలుస్తోంది.
14 వ ఆర్థిక సంఘం నిధులు ఇటీవలే పాత గ్రామపంచాతీలకు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన దాదాపు 1500 కోట్ల రూపాయలు ఇప్పుడు పంచాయతీలకు అందుబాటులో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిధులను కొత్తగా ఏర్పాటవుతున్న గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదకన ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నిధులను ఖర్చు చేసేందుకు వెంటనే ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా బ్యాంకుల్లో అకౌంట్లు ప్రారంభించాల్సి ఉంది. నిధుల వినియోగంలో ఇద్దరూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయిదేళ్లపాటు సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా పనిచేసిన వారు ఇప్పుడు తమ గ్రామంలో ఏ పని కావాలనుకున్నా ప్రత్యేక అధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది.
కోలాహలంగా కొలవుతీరనున్న కొత్త పంచాయతీలు
-------------------------------------
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 4383 పంచాయతీలు గురువారం నుండి పనిప్రారంభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 534 మండలాల్లో 8690 గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నాయి. వీటిలో 306 పంచాయతీలు సమీప మున్సిపాలిటీల్లో కలిశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు గురువారం నుండి పనిచేయడం ప్రారంభమవుతుంది. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలను అట్టహాసంగా ప్రారంభించాలని ప్రభుత్వం ఆ యా గ్రామ పంచాయతీల బాధ్యులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తెరాస హయాంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్దవల్ల కొత్త పంచాయతీలు ఏర్పడ్డవంటూ ప్రజలకు తెలియచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త పంచాయతీలు ఏర్పటవుతున్న గ్రామాల్లో పండగవాతావరణం నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరిగాయి.