రాష్ట్రీయం

ప్రైవేటు కాలేజీల్లో తెలుగు రాష్ట్రాలే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: తెలుగు రాష్ట్రాల్లోనే ప్రైవేటు విద్యాసంస్థలు అధికంగా ఉన్నాయని, ఎక్కువగా ఆ రెండు రాష్టల్ర విద్యార్ధులూ ప్రైవేటు విద్యపై ఆధారపడుతున్నారని అఖిల భారత ఉన్నత విద్య సర్వేలో తేలింది. ఏఐఎస్‌హెచ్‌ఈ 2017-18 సర్వేను కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం దేశంలో 903 యూనివర్శిటీలు, 39,050 కాలేజీలు ఉన్నాయి. ఇందులో 10,011 విద్యాసంస్థలు ఒకే కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. 343 యూనివర్శిటీలు ప్రైవేటు రంగంలో ఉండగా, 357 యూనివర్శిటీలు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి. మహిళల కోసం 15 యూనివర్శిటీలు పనిచేస్తున్నాయి. అందులో నాలుగు రాజస్థాన్‌లోనూ, రెండు తమిళనాడులోనూ, ఆంధ్రా, అస్సాం, ఢిల్లీ, హర్యానా, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిసా, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఒకొక్కటీ చొప్పున పనిచేస్తున్నాయి. వీటికి తోడు సెంట్రల్ ఓపెన్ యూనివర్శిటీ ఒకటి, 14 రాష్ట్ర స్థాయి ఓపెన్ వర్శిటీలు, ఒకటి ప్రైవేటు ఓపెన్ యూనివర్శిటీ, 110 రెగ్యులర్- ఓపెన్ యూనివర్శిటీలు ఉన్నాయి. ఇందులో 16 వర్శిటీలు తమిళనాడులోనే ఉన్నాయి. 500 సంప్రదాయ వర్శిటీలు, 126 టెక్నికల్ వర్శిటీలు, 70 వ్యవసాయ దాని అనుబంధ వర్శిటీలు, 58 మెడికల్ యూనివర్శిటీలు, 22 లా యూనివర్శిటీలు, 13 సంస్కృత యూనివర్శిటీలు, 10 భాషా పరమైన యూనివర్శిటీలు ఉన్నాయి. 83 ఇతర క్యాటగిరి వర్శిటీలు పనిచేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోనే ఉన్నత విద్యాసంస్థలు అత్యధికంగా ఉన్నాయి. బెంగలూరు అర్బన్ జిల్లాలో 893 కాలేజీలతో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాలు జైపూర్ (558)కే దక్కుతుంది. దేశవ్యాప్తంగా చూస్తే 60.48 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 11.04 కాలేజీలు మహిళలకు ఉద్ధేశించినవే. 3.6 శాతం కాలేజీలు మాత్రమే పీహెచ్‌డీ ప్రోగ్రాం నిర్వహిస్తుండగా, 36.7 శాతం కాలేజీలు పీజీ స్థాయి కోర్సులను నిర్వహిస్తున్నాయి. దేశంలో జీఈఆర్ 25.8 శాతం కాగా, యూజీ స్థాయికి 79.2 శాతం మంది వస్తున్నారు. గత ఏడాది పీహెచ్‌డీ కోర్సులో 1,61,412 మంది చేరారు. కోర్సుల వారీ చూస్తే బిఏలో 36.4 శాతం, బిఎస్సీలో 17.1 శాతం, బికాంలో 14.1 శాతం, ఇంజనీరింగ్ అనుబంధ రంగాల్లో 14.1 శాతం మంది చేరుతున్నారు. సంఖ్యా పరంగా చూస్తే బిఏలో 23.89 లక్షలు, బిఎస్సీలో 11.52 లక్షలు, బికాంలో 9.39 లక్షలు చేరారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో 166 దేశాలకు చెందిన 46,144 మంది విదేశీ విద్యార్ధులు చదువుతున్నారు. అత్యధికంగా నేపాల్ నుండి 24.9 శాతం మంది విద్యార్థులుండగా, ఆఫ్గనిస్తాన్ నుండి 9.5 శాతం, భూటాన్ నుండి 4.3 శాతం, నైజీరియా నుండి 4 శాతం విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 78 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12.84 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అందులో పురుషులు 58 శాతం కాగా, 42 శాతం మంది స్ర్తిలు, కాలేజీ స్థాయిలో విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి చూస్తే 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. 2017లో 34,400 మంది పిహెచ్‌డీ డిగ్రీలను పొందారు.అందులో 20,179 మంది పురుషులు, కాగా 14,221 మంది మహిళలు ఉన్నారు.