రాష్ట్రీయం

ఆథానీ, అంబానీలతో కేసీఆర్ కుటుంబం పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కుటుంబం ఇప్పుడు అంబానీ, ఆదానీలతో పోటీ పడుతున్నదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఈ విధంగా, ఇంత స్థాయిలో అవినీతికి పాల్పడలేదని ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు టెండర్లన్నీ పారదర్శకంగా నిర్వహించినట్లు భావిస్తే బయటపెట్టవచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు. గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. వేల కోట్ల టెండర్లను సింగిల్ టెండరుగా ఇచ్చింది వాస్తవం కాదా? అని నిలదీశారు. నిరుపేదలు, దళితులు, గిరిజనులు తమ భూములను ప్రభుత్వం లాక్కుంటున్నదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్పేమిటని ఆయన అడిగారు. అవేమైనా నిషిద్ధిత సంస్థలా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చులకన భావంతో ఉన్నారని ఆయన ఆవేదన చెందారు.

తెలంగాణ కేసీఆర్ జాగీరా?
ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ సమయంలో నిరాహార దీక్షను ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. కోర్టులపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారించాలని కోరారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదని అన్నారు. ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ తుమ్మిడిహెట్టికి సానుకూలకంగా చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రజలను బానిసలుగా చేస్తామంటే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవాలు చెప్పకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలకు, విమర్శలకు పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగీరా? అని ఆయన ప్రశ్నించారు.

చిల్లర మాటలు మాట్లాడం..
టీఆర్‌ఎస్ నాయకుల తరహాలో తాము చిల్లర మాటలు మాట్లాడమని ఉత్తమ్ ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. మంత్రి హరీష్ దిగిజారి మాట్లాడడం బాధాకరమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు టూరిజం ట్రిప్‌లు తీసుకెళ్ళడం కాదు, తుమ్మిడిహెట్టి, సిరిసిల్ల దళితుల వద్దకు తీసుకెళితే బాగుంటుందని ఆయన సూచించారు. తాము రైతుల గురించి ఆలోచిస్తుంటే, కేసీఆర్ కాంట్రాక్టర్ల గురించి ఆలోచిస్తున్నారని ఉత్తమ్ మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేసి చూపిస్తామని అన్నారు.