రాష్ట్రీయం

స్పాట్ అడ్మిషన్లకు అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు వెంటనే అనుమతి మంజూరు చేయాలని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రధానకార్యదర్శి ఎస్‌వీసీ ప్రకాష్ కోరారు. ఈ మేరకు ఆయన దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రికి ఒక వినతి పత్రం అందజేశారు. దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని దోస్త్ కన్వీనర్ వారికి హామీ ఇచ్చారు. ఇంత వరకూ సీటు రాని వారు, సీటు వచ్చినా చేరని వారికి స్పాట్ అడ్మిషన్లలో అవకాశం కల్పించాలని వారు కోరారు. గతంలో రిజిస్టర్ చేసుకోని వారికి కూడా స్పాట్‌లో వీలుకల్పించాలని అన్నారు. తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల తుది విడతకు 20,741 మంది వెబ్ ఆప్షన్లను ఇవ్వగా, 19,145 మందికి సీట్లు దక్కాయి. మూడు దశల్లో కలిపి మొత్తం మీద 1,84,853 మందికి డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా సీట్లు వచ్చాయని ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు.