రాష్ట్రీయం

మానవ అక్రమ రవాణాపై అప్రమత్త అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: జంటనగరాల్లో ఏదోఒక ప్రాంతంలో మానవ అక్రమ రవాణాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై ముఖ్యంగా మహిళలు, పిల్లలు అప్రత్తంగా ఉండాలని తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి నగర పౌరులకు సూచించారు. ఇలాంటి సంఘటన పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పటకీ గల్లీల్లో జరుగుతున్న సంఘటనలను పోలీసుల దృష్టికి స్థానిక మహిళలు, పిల్లలు సమాచారం అందివ్వాలని ఆయన కోరారు. బుధవారం పోలీస్ శాఖ షీటీం ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీని హోంమంత్రి జెండాఊపి విద్యార్థులను పరుగుపెట్టించారు. ఈ ర్యాలీ హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ నుంచి చార్‌మీనార్‌కు సాగింది. వివిధ పాఠశాలల నుంచి దాదాపు 3వేల మంది విద్యార్థలు పాల్గొనడం పట్ల హోంమంత్రి అభినంధించారు. మహిళలకు, పిల్లలకు భద్రతో పాటు సురక్షిత సేవలు అందించడానికి పోలీసులు నిరంతరం శ్రమిస్తారన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్‌కుమార్ మాడ్లాడుతూ ప్రజ్‌వాలా స్వచ్ఛంద సంస్థ మానవ అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలను ఆయన కొనియాడారు. ఇలాంటి సంస్థలు మరిన్ని ముందుకు రావాలని ఆయన సూచించారు. చార్‌మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహమ్మద్ పాస ఖాద్రి మాట్లాడుతూ మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు సఫలం అవుతున్నయని అన్నారు. గత మూడేళ్ళలో వేలాది మంది బాధితులు పోలీసులను ఆశ్రయించడం జరిగిందన్నారు.ప్రజ్‌వాలా సంస్థను పర్యవేక్షిస్తున్న సునీతకృష్ణ మాట్లాడుతూ మానవ విక్రయాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చర్చలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. సీనియర్ పోలీసు అధికారులు శిఖాగోయల్, డిఎస్ చౌహాన్ పాల్గొన్నారు.