రాష్ట్రీయం

కాంగ్రెస్ ర్యాలీ భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ చేపట్టాలనుకున్న నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. నేతలను కార్యకర్తలను గాంధీ భవన్ సమీపంలోనే అడ్డుకొని అరెస్టు చేశారు. యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు బుధవారం గాంధీ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ డౌన్ డౌన్’, ‘అవినీతిని సర్కార్‌కు బుద్ధి చెప్పండి’ అంటూ నినాదాలు చేస్తూ కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాగా, వారిని పోలీసులు కొద్ది దూరంలోనే అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుని నాంపల్లి వైపు వెళ్ళేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ అరెస్టు చేసి వాహనాల్లో గోషామహల్‌తోపాటు ఇతర పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసి, గోషామహల్‌కు తరలించారు. అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ యుద్ధ విమానాల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఎక్కువ ధరకు ఖరీదు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. తను కెప్టెన్ కాబట్టి యుద్ధ విమానాల కొనుగోలుపై అవగాహన ఉందని చెప్పారు. మరోవైపు మహిళలు కొందరు మరో దారిలో సీఎం క్యాంపు కార్యాలయం వైపు వెళ్ళేందుకు యత్నించగా, పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు.