రాష్ట్రీయం

మొక్క నాటి.. నీరు పోసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బుధవారం శ్రీకారం చుట్టారు. సీఎం ములుగు, ప్రజ్ఞాపూర్‌లో కొబ్బరి, గజ్వేల్‌లో కదంబ మొక్కలను నాటారు. గజ్వేల్ పట్టణాన్ని హరిత గజ్వేల్‌గా తీర్చిదిద్దేందుకు ఒకే రోజు లక్ష 116 మొక్కలను నాటడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంత్‌రావు ఆధ్వర్యంలో గజ్వేల్ లక్ష నూట పదహారు మొక్కలను నాటేందుకు గుంతలు, మొక్కలను సిద్ధం చేశారు. వారం రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం నిర్విరామంగా శ్రమించి కేసీఆర్ పర్యటనకు గజ్వేల్‌ను ముస్తాబు చేశారు. హరితహారం కోసం ప్రత్యేక బస్సులో సీఎం మొదట ములుగు మండల కేంద్రానికి గంట సేపు ఆలస్యంగా చేరుకున్నారు. ములుగులో కొబ్బరిమొక్కను నాటారు. అక్కడ నుండి సింగరాయ కొండ వద్ద ఆటవీ శాఖ అధికారులు ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. అక్కడ నుండి గజ్వేల్ పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తాలోని సమీకృత మార్కెట్ యార్డు వద్దకు కదంబ మొక్కను నాటి, నీళ్లు పోశారు. మసీదుల్లో సైరన్ మోగించగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ బస్సులో ప్రజ్ఞాపూర్‌కు చేరుకున్నారు. కూర నాగరాజు ఇంటి వద్ద కొబ్బరి మొక్కను నాటారు. ఇంటి కుటుంబ సభ్యులతో ముచ్చటించి వెళ్లిపోయారు. కేసీఆర్ వెంట మంత్రులు జోగు రామన్న, హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, హరితహారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
సీఎం కోసం గంటల కొద్దీ విద్యార్థుల నిరీక్షణ
నాలుగు విడత హరితహారం ప్రారంభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గజ్వేల్‌కు వస్తుండడంతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది, ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులను భాగస్వాములను చేయాలని ర్యాలీగా పెద్దఎత్తున తీసుకొచ్చారు. ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వరకు మూడు కిలోమీటర్లు రోడ్డుకిరువైపులా విద్యార్థులను క్యూలైన్‌లో నిల్చోబెట్టారు. హరితహారం విజయవంతం చేయాలని ఫ్లెక్సీ బ్యానర్లు పట్టుకొని కేసీఆర్ కోసం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు పైగా వేచియున్నారు. దీంతో ఎండవేడిమిని తట్టుకోలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద ఎలాంటి టెంట్లు, స్టేజీలు ఏర్పాటు చేయకపోవడం వల్ల సాంస్కృతిక సారధి కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కేసీఆర్ పర్యటనకు భారీ బందోబస్తు- ఐజీ పర్యవేక్షణ
గజ్వేల్‌లో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ మొక్కలు నాటే ప్రాంతాల్లో మూడంచెల భద్రతను పటిష్టంగా అమలు చేశారు. బారికేడ్లు దాటి రాకుండా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మొక్కలు నాటే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. గజ్వేల్‌లో మొక్కలు నాటే ప్రాంతం సమీపంలోని టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల సైతం అనుమతించలేదు. సీఎం పర్యటనకు హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, డీఐజీ శివశంకర్, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పర్యవేక్షించారు. కేసీఆర్ బస్సు యాత్ర రాగానే రోప్ పార్టీ ఎవరినీ దగ్గరికి రాకుండా అడ్డుకున్నారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియటంతో పోలీసు అధికార యంత్రాగం ఊపిరి పీల్చుకున్నారు.